బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, మేయర్ నీతూ కిరణ్ తదితరులు…

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:

మోడీ పువ్వు గుర్తు పార్టీ పేదోల్ల కడుపుకొట్టి పెద్దోళ్లకు దోచి పెడుతుంది

కేసిఆర్ ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇస్తుంటే.. అన్ని రకాల ధరలు పెంచి ప్రతి ఇంటి నుంచి నెలకు 4వేల రూపాయలు దోచుకుంటున్నది మోడీ ప్రభుత్వం

బీజేపీ మోడీ పాలనలో పేదల పరిస్థితి అత్యంత బాధాకరం..

దరిద్రపు బిజెపి పాలన వల్ల మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది

ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్న మోడి ప్రభుత్వాన్ని విసిరి పారేయాలి

2011లో కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి 50 రూపాలు పెంచితే అప్పటి బిజెపి నాయకురాలు,ఇప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అరిచి గగ్గోలు పెట్టినారు.. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు.

ఈరోజు మీరున్న మోడి ప్రభుత్వం 13 సార్లు 750 రూపాలు పెంచింది ..ప్రజలకు ఎం సమాధానం చెప్తారు..

పెంచిన ధరలు తగ్గించాలని పేదింటి మహిళల తరుపున కేంద్రాన్ని స్మృతి ఇరానీ డిమాండ్ చేయాలి

సిలెండర్ నిరు పేదల నిత్యావసర వస్తువు..కుటుంబాల పై గ్యాస్ ధర చాలా ప్రభావం చూపుతుంది

35 వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తే గ్యాస్ ధర 450 కే వస్తది.. కానీ మోది ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేసింది

పెట్రోల్ డీజిల్ ధరలు పెంచటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ప్రధాని మోడీ తన గుజరాత్ దోస్తులకు 10 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారు

మోదీ దోస్తు అదాని ఒక్కడికి మాఫీ చేసినన్ని డబ్బులు సబ్సిడీ గా ఇచ్చినా దేశంలో సిలిండర్ 450 కే వస్తుంది.

మోదీ అవినీతి నీ ప్రశ్నిస్తున్నవారిపై సి బి ఐ, ఈడి దాడులు చేస్తున్నారు..

కేసీఆర్ ధైర్యం గా ప్రశ్నిస్తున్నందుకే బిఆర్ఎస్ నేతలను వేదింపులకు గురిచేస్తున్నారు..

కేసిఆర్ బిడ్డా కవితను ఇబ్బంది పెడుతున్నారు..నిజామాబాద్ అక్కా చెల్లెళ్ళు బీజేపీకి బుద్ది చెప్తారు.

పేదలను అన్ని విధాలా వేదిస్తున్న బీజేపీని,ఆ పార్టీ నాయకుల్ని ఎక్కడిక్కడ నిలదీయాలి…బుద్ది చెప్పాలి.

You missed