రాష్ట్రంలో ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. అదెప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంది. వివాదాల‌న్నీ దీని చుట్టూనే ముసురుకుంటుంటాయి ఎప్పుడూ. ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కూడా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచాడు. జీవ‌న్ రెడ్డిపై బీజేపీ స‌ర్పంచ్ భ‌ర్త ప్ర‌సాద్ గౌడ్ హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసుకుని దొరికిపోయాడు. పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్ప‌ట్నుంచి ఎమ్మెల్యేకు ప‌రామ‌ర్శ‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. కేటీఆర్‌, కేసీఆర్ త‌ప్ప దాదాపు అంద‌రూ వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఇదో వైపు సాగుతుండ‌గానే మ‌రోవైపు ఆర్మూర్‌లో గౌండ్లు ఏక‌మ‌య్యారు.

ఎమ్మెల్యే త‌మ గౌడ జాతి బిడ్డ‌పై అక్ర‌మ‌కేసులు పెట్టాడ‌ని ఆరోపిస్తూ ధ‌ర్నా చేశారు. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఓ నిందితుడికి అండ‌గా నిల‌వ‌డ‌మే కాదు… ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేయ‌డం.. ఈ హ‌త్యాయ‌త్నం కేసులో ట్విస్ట్‌. ఇప్పుడిదే హాట్ టాపిక్‌. అందుకే… ఆర్మూర్‌లో అంతే.

You missed