తెలంగాణలో ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేదు
నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం
మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు
వాట్సాప్ లో అన్ని అసత్యపు ప్రచారాలే
యువత దీనిపై అప్రమత్తంగా ఉండాలి
యువత మౌనం సమాజానికి మంచిది కాదు.అభివృద్ధి పై మీ ప్రెండ్స్ తో,బంధువులతో విస్తృతంగా చర్చించాలి
-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ (వేల్పూర్):
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ దుర్గ మండలి,యాదవ యూత్,ఎస్సి యూత్ నుండి 100 మంది యువకులు ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు.గులాబీ కండువా కప్పి మంత్రి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..
కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి చూసి ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన 100 మంది యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉన్నదన్నారు.ఇంతపెద్ద ఎత్తున ఏర్గట్ల నుంచి యువత టిఆర్ఎస్ చేరి అభివృద్ధి వైపే ఉంటామని నిరూపించారన్నారు.ఇది మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలువనుందని చెప్పారు.ఏర్గట్ల మండల కేంద్రం చేసుకోవడమే కాకుండా 2 కోట్లతో అంతర్గత సి.సి రోడ్లు వేసుకున్నామని తెలిపారు. నియోజకవర్గం అంతటా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో గమనించాలన్నారు. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కాక ముందు అభివృద్ధి ఏమి జరిగిందనే చర్చ జరగాలని పిలుపునిచ్చారు.యువత మౌనంగా ఉండకూడదని మంచి చేసే వారికి కచ్చితంగా ప్రోత్సహం అందించాలన్నారు.
కరెంట్ ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ సబ్ స్టేషన్లు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చెక్ డ్యాములు నిర్మించుకున్నామని,ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా నీటి గోస లేకుండా చేసుకున్నామని తెలిపారు.గ్రామాల్లో సి.సి రోడ్లు,డ్రైన్స్,వైకుంఠ దామాలు,డంపింగ్ యార్డులు,పల్లె ప్రకృతి వనాలు,ట్రాక్టర్,ట్రాలీ లాంటి అభివృద్ధి గతంలో ఎందుకు లేదని బీజేపీ,కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. వీటిపై మీకు తెలిసిన వారితో బంధువులతో చర్చించాలని కోరారు.ప్రజాస్వామ్యానికి అభివృద్దే మెట్టు కావాలని,పనికి-ఓటుకు లింక్ పెట్టి చూడాలన్నారు.కేసీఆర్ కు ముందు కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి పై చర్చ జరగాలన్నారు.
తెలంగాణలో ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేదని ప్రశ్నించారు.తెలంగాణ లో కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.కొందరు మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని,వాట్సాప్ లో అన్ని అసత్యపు ప్రచారాలే చేస్తున్నారని మండిపడ్డారు.యువత దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.వారి అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎంపిపి ఉపేందర్ రెడ్డి,జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ పలువురు టిఆర్ఎస్ నాయకులు,స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
