మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పీఏ మల్లారెడ్డిని అక్కడి స్థానిక మీడియా ప్రతినిధులు తుక్కు తుక్కు కింద తన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఎందుకు కొట్టారో తెలియదు కానీ, పోలీసుల సమక్షంలోనే విలేకరులు, వీడియో గ్రాఫర్లు, కెమెరామెన్లు మల్లారెడ్డిని బాగానే అర్సుకున్నారు. దీని వెనుక అసలు ఏం జరిగిందంటే… రంగారెడ్డి లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ గా పట్నం మహేందర్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు వచ్చాడు.
అతను లోపలికి వెళ్లగానే ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి తన భార్య తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి రావడంతో రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుటనే మహేందర్ రెడ్డి అనుచరులు అతన్ని అడ్డుకున్నారు. లోపలకి వెళ్లనీయకుండా ప్రతిఘటించారు. నామినేషన్ పత్రాలను గుంజుకుని చింపేశారు. సత్యానారయణరెడ్డి మీద దాడికి దిగారు. మీడియా సాక్షిగా, పోలీసుల సాక్షిగా మహేందర్ రెడ్డి అనుచరులు రౌడీల్లా ప్రవర్తించారు.
ఇదంతా లోకల్ మీడియా కవర్ చేసింది. దీంతో అలర్టయిన మహేందర్ రెడ్డి తన పీఏ మల్లారెడ్డిని పురమాయించాడు. వారికి పదివేల చొప్పున అమౌంట్‌ను ఆగమేఘాల మీద సెట్ చేశాడు పీఏ. అయితే ఇందులో కొందరికి రాలేదు. దీనిపై కొందరు వీడియో గ్రాఫర్లు పీఏను నిలదీశారు. మల్లారెడ్డికి మండింది. ఏమోమో అన్నాడు. ఆ వీడియో గ్రాఫర్ కు తిక్కరేగింది. ఒక్కటిచ్చుకున్నాడు. మల్లారెడ్డి భగ్గుమన్నాడు. రెండిచ్చాడు.
ఇగ అందరూ అర్సుకున్నారు మల్లారెడ్డిని. బూతులు తిడుతూ తన్నారు. ఇదీ జరిగింది సంగతి. మాజీ మంత్రి మీద, ఈ పీఏ మీద విలేకరులకు ఎప్పటి నుంచో మంట. పడదు. మహేందర్‌రెడ్డికి నోటి దురుసు బాగా ఉంటుందని, విలేకరులను పట్టించుకోవడని, అధికారులతో కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడని ఆరోపణలున్నాయి. మహేందర్‌రెడ్డి పీఏ మల్లారెడ్డి కూడా తన బాస్‌లాగే తయారయ్యాడు. ఇలా అవకాశం వచ్చిందని అర్సుకున్నారంతా.