ఇదీ చైత‌న్యం అంటే. ఇదీ పోరాట ప‌టిమ అంటే. ఇదీ ప్ర‌శ్నించ‌డ‌మంటే. అవును ఇన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. మాకిస్తందుకే పైస‌లు లేవా? ఇన్ని రోజులు తాగినంత తాగిపిచ్చిర్రు. తిన్నంత తినిపిచ్చిర్రు. మ‌జా చూపించి మురిపించిర్రు. మ‌రి ఇగ ఒక్క రోజే ఉంది. ఆ త‌ర్వాత మీర‌టు .. మేం ఇటు. మ‌ళ్లా మాకు గ‌వే ప‌నులు. బ‌ర్ల కాడికి పోవాలె. చేన్ల ప‌నులు చెయ్యాలె. ఉపాధి కూలీగా మారాలె. కైకిలు పోవాలె. పాసి మందు క‌ల్లు తాగాలె. మ‌ళ్లా మావి పాత బ‌తుకులు. మీరెవ‌రు గెలిచినా మాకు ఒరిగేదీ లేదు. మా బ‌తుకులు మారేదీ లేదు.

అందుకే ఇప్పుడే గుంజాల మీ ద‌గ్గ‌ర‌. మ‌ళ్లా దొర‌క‌రు. ఒక్క ఓటుకు 20వేల‌న్నారు. ఇదే ప్ర‌చారం చేసిండ్రు వారం నుంచి. కొంద‌రైతే ఏహె ఊకోరా బై 50వేలు ఇస్త‌రంట లాస్టుల. నీకెం తెల్సు అంటే.. మురిసి స‌చ్చినం. మా లెక్క‌లు మాకున్నాయి. మా అప్పులు మాకున్నాయి. క‌రోనా దెబ్బ‌కు మొన్నటి దాక ప‌నీపాట లేక లేవ‌లేకుండా ప‌డి ఉన్నాం. గీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఏదో ఇట్ల నాలుగు పైస‌లొస్తే అప్పులు తీర్చుకుందామ‌నుకున్నం. ఇంట్ల‌కు గాసానికి ప‌నికొస్త‌య‌ని సంబ‌ర‌ప‌డ్డం.

కొంద‌రికేమో పైస‌లిచ్చిండ్రు. మ‌రి మాకెందుకు ఇయ్య‌రు. బ‌రాబ‌ర్ ఇయ్యాలె. ఆరువేలు.. ప‌దివేలు కాదు.. ఇర‌వై వేలియ్యాలె. ఏం త‌మాషాగా ఉందా? ఈ ఎన్నిక‌ల మీకు గెల‌వ‌డం ఎంత అవ‌స‌ర‌మో మాకు తెల్వ‌దా? మ‌మ్మ‌ల్నే ప‌ట్టించుకోరా..? ఊకునేది లేదు ఇచ్చేదాకా?