నాయకులు ప్రజాసేవకు అర్థమే మార్చేస్తున్నారు. ఎక్కడుంటే నీకేందీ? నీ బాధ తీర్చితే చాలదా? ఓ వైపు బోరున వర్షాలు పడుతుంటే.. ఇప్పుడు మీ దగ్గరకు నేను రావాల్నా..? రాలేను. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో నా ఇంట్లో వెచ్చగా పడుకుని ఉన్నా. అందుకే ఆన్‌లైన్‌లోకి రండి. లైవ్‌లో సమస్యలు తెలుపండి. అన్నీ రాసుకుంటా. కూసున్న చోటే అధికారులకు చెప్పి పురమాయిస్తా. వాళ్లు మీ దగ్గరకు రాకపోతే ఒట్టు. సమస్యలు తీర్చకపోతే చూడు. ఒకవేళ పని కాలేదా? మళ్లీ ఆన్‌లైన్‌లోకి రండి. లైవ్‌లో చెప్పుకోండి. అంతే.. పనయ్యేదాకా వదిలేది సన్నాసులను. మనమంటే ఏమనుకుంటున్నారు. సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో మనని చూసి నేర్చుకోవాల్సిందే ఎవరైనా.
సరే, సరే.. ఎన్ని చెరువులు తెగియన్. ఎంత పంట మునిగింది. ఎందరు చచ్చారు? ఎన్ని వాగులు తెగినయ్. ఎన్ని రోడ్లు కొట్కపోయినయ్… ఊ.. కమాన్ చెప్పండి.. రాసుకుంటున్నా..
ఓకే.. ఓకే… ఈ రోజు లైవ్ ముగిసింది. రేపు మళ్లీ ఇదే టైంకు కలుద్దాం. లైవ్‌లో. మరిన్ని సమస్యలతో మీరు ముందుకు రండి. దీన్ని బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. మనం ఏ విధంగా అంగీ ఇస్త్రీ నలగకుండా ప్రజాసేవ చేస్తున్నామో చూసి తెలుసుకోవాలె. లీడర్ అంటే ఇలా ఉండాలని అంతా అనుకోవాలె. సరేనా..?