నిన్న భారత్‌బంద్‌లో భాగంగా ఆందోళనలో పాల్గొన్న కోదండరామ్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్టు చేశారని కొందరు సోషల్ మీడియాలో ఆయన ఫోటోను పెట్టారు. ఎడమ కాలు ప్యాంటు కింద భాగమంతా చినిగిపోయి ఉంది. అయినా.. పోలీసుల తోపులాటలు, బట్టలు చినిగడం ఇదేమీ ఆయనకు కొత్తకాదనుకుంటా. ఒక రకంగా చెప్పాలంటే.. ఆయన ఆందోళనలకు దూరంగా ఉండటమే కొత్త. చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా పాల్గొని వెళ్లడమే కొత్త. ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలపై స్పందించకపోవడమే వింత. ఉద్యమకారులకు ఇవన్నీ కొత్తేం కాదు కదా. లాఠీ దెబ్బలు తిని జైళ్లకు పోయి వచ్చినోళ్లకు ఇలా బట్టలు చినిగితే అవమానామా? కానే కాదు. ఓహో .. కష్టపడి, ప్రాణాలకొడ్డి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ మాకిందే గతీ అంటారా? ప్రభుత్వం ఏదైనా .. అది ప్రభుత్వమే. అట్లనే ఉంటది. అది తెలంగాణనా? ఆంధ్రానా..? ఇంకొకటా? సంబంధం లేదు. సీఎంలు అలాగే ఉంటారు. పోలీసులు ఇలాగే ఉంటారు. ఉద్యమకారులు ఇలాగే తన్నులు తింటారు. జైళ్లకు పోతారు. అంతే. అర్థం చేసుకోరూ..!