జమ్మికుంట రెండ్ల ఆత్మీయ సమ్మేళనంలో రెడ్ల నేతలంతా నిజాలె ఒప్పుకున్నారు. మనమెంత? మనవాటా ఎంత? అని ముద్దుగా చర్చించుకున్నారు. ప్రభుత్వం మనకిస్తున్న ప్రయార్టీ ఏందీ? మనమేందీ..? మన కులమేందీ? అని ఛాతి విరుచుకు మాట్లాడుకున్నారు. అన్నీ నిజాలె. ఈ వేదికగా మాత్రమే బయటకొచ్చారు. మరో సారి ఇలాంటివి అస్సలు బయటకు రావు. పల్ల రాజేశ్వర్‌రెడ్డి ఈ గణాంకాలన్నీ చెప్పారు. జాతి కోల్పోతున్న ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. వైరాగ్యంతో, జీవితం మీద విరక్తితో రగిలిపోతున్న రెడ్డి కులస్తుల్లో భరోసా నింపేలా మాట్లాడాడు. బాగుంది. తెలంగాణలో కులాల ప్రస్తావన, ఎవరికెన్ని పదవులు, సీట్లు.. ఇవన్నీ లెక్కలు వేసుకునేందుకు మంచి దారే చూపిండు. అవునూ .. కేసీఆర్‌కు ఇవన్నీ లెక్కలు తెల్వదా? తెలుసు. కానీ ఎవరికెన్ని ఇయ్యాల్నో వాళ్లకే ఇస్తాడు. నోరు లెవ్వొద్దు. వ్యతిరేకంగా మాట్లాడొద్దు. వారికో సీటు పడేస్తే.. అలా కూర్చుండిపోతారన్నమాట.