మంత్రి మల్లారెడ్డి మాస్ లీడర్. కష్ట పడి పైకొచ్చాడు. రాజకీయంగా ఎదిగాడు. ఇవన్నీ ఒకెత్తు. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని అమయాకుడు. చాలా సందర్భాల్లో ఆయన మాట మతితప్పుతూ ఉంటుంది. ఏది తోస్తే అది అలా మాట్లాడేస్తూ ఉంటాడు. కల్మశం ఉండదు. కానీ ఆ మాటలు కల్లోలం రేపుతాయి. అప్పుడప్పుడు అభాసుపాలవుతాడు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాయి. అందుకే ఆ మాటలకు సీరియస్‌నెస్ ఉండదు. అంత కామెడీయే. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మాటలు కూడా వివాదంలో ఇరుక్కుంటూ ఉంటాయి. నోరు జారుతాడు. తర్వాత సారీ చెబుతాడు. ఆవేశానికి లోనవుతాడు. తొడలు కొడుతాడు. తర్వాత నాలిక మడత పెడతాడు. ఏది చేసినా ఆయనకే చెల్లుతుంది.

తాజాగా ఆరేళ్ల పాప అత్యాచార, హత్య ఘటన పై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆవేశంగా స్పందించాడు మంత్రి మల్లారెడ్డి. ఎన్‌కౌంటర్ చేసి పాడేస్తామన్నాడు. అప్పటికి ఉపశమనం పొందాడు. ఆ తర్వాత పరిణామాలు ఆలోచించలేదు. బాధ్యత గల ఓ మంత్రి పదవిలో ఉండి ఎన్‌కౌంటర్ చేస్తామని మాట్లాడడం ఇప్పుడు వివాదస్పదమైంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఎంత మందిని చంపుకుంటూ వెళ్తారు మంత్రి గారు అని ప్రశ్నిస్తున్నారు. సమస్య మూలల్లోకి వెళ్లి పరిష్కరించేది ఉందా? ఎన్‌కౌంటర్‌తోనే సరిపెట్టేది ఉందా అని విమర్శల దాడి చేస్తున్నారు. మొన్న రేవంత్‌రెడ్డిని తిట్టే ఆవేశంలో పిచ్చకుంట్లోడ అని ఓ కులాన్ని కించపరిచి ఆ తర్వాత సారీ చెప్పాడు. ఇక తొడ గట్టి అబే సాలె అంటూ మాట్లాడిన తీరు నవ్వుల పాలైంది. కానీ మన కేటీఆర్‌కు ఇది నచ్చింది. అంతే కొందరు కొందరికి నచ్చుతారు. కొన్ని సార్లు వారే నవ్వుల పాలవుతారు.

You missed