నాటకాల రాముడు! పదేళ్ళూ చేయాల్సిందంతా చేసి ఇపుడు నీతిసూత్రాలు!! కేసీఆర్ నియంతృత్వ పాలనలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులకు తోపులు మీరే! జర్నలిస్టుల ఉసురు పోసుకున్నదీ మీరే.. సర్కార్ భూములమ్ముకున్నదెవరు!? ఎమ్మెల్యేల అరాచకాలను పెంచి పోషించింది మీరు కదా!? అవినీతిమయం,అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది పెద్దసారు పాలనే కదా! ఫోన్ ట్యాపింగ్ లతో తెలంగాణ ఇజ్జత్ తీసింది ఎవరు?? అన్నిట్లో తోపులు మీరే…టాప్ ర్యాంకూ మీదే! దొంగే దొంగా దొంగా అన్నట్టుగా తెలంగాణ భవన్ లో డ్రామాలు!!
(దండుగుల శ్రీనివాస్) ఓ నక్క ప్రమాణం చేసిందంట… ఇంకెవర్నీ మోసగించనని! ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించనని!! ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి. అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత ఇది. అచ్చంగా కేటీఆర్‌కు, కేసీఆర్ పాలనకు…
