ఇందూరు నగరానికి మళ్లీ సిటీబస్సుల కళ వచ్చింది. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత సిటీ బస్సులు నగరంలో తిరగనున్నాయి. ఈరోజు నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్రంలో లోని ఆర్టీసీ ప్రధాన బస్ స్టాండ్లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో కలిసి సిటీ బస్సులను ఈ రోజు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్ , నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సిటీ బస్సులను ప్రారంభించారు..
ఈ సందర్భంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్టిసి కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..
నిజామాబాద్ నగర ప్రజలందరికీ సిటీ బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు..
30 సంవత్సరాల తర్వాత మళ్లీ నిజామాబాద్ నగరంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో బస్సులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు..
నిజామాబాద్ నగర ప్రజలు అందరూ ఆర్టీసీ సంస్థ ప్రారంభించిన సిటీ బస్సులలో సురక్షితమైన ప్రయాణాలు కొనసాగించాలని ఆకాంక్షించారు..
కేసీఆర్ ప్రతి ఏటా ఆర్టీసీకి బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు..
నిజామాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన బస్సులు రవాణా ఉండడం వల్ల జిల్లాలో బస్టాండ్ సరిపోవడం లేదని, నిజామాబాద్ నగరంలో అతి త్వరలోనే నూతన బస్టాండ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు..

