హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నాయి. దాదాపు మూడు నెలలుగా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని రాష్ట్ర వ్యాప్తంగా జనం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్ వాతావరణం మాత్రం ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయనే విధంగా వాడివేడిగా ఉంది. ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. ఓ వైపు బీజేపీలో నోటిఫికేషన్ ఆలస్యం పై నైరాశ్యం నెలకొన్నది. టీఆరెస్ మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తున్నది. ఎంత లేట్ అయితే అంత మంచిదనే దోరణిలో ఆ పార్టీ ఉంది. రోజు విపరీతమైన ఖర్చు చేస్తున్నది టీఆరెస్. అందరినీ తమ వైపుకు తిప్పకుంటున్నది. దావతులు ఇస్తున్నది.
పరోబాలపర్వం జోరుగా కొనసాగుతున్నది. ఈ ఖర్చులకు బీజేపీ తట్టుకోలేకపోతున్నది. వెంటనే ఎన్నికలు జరిగితే తమకు మైలేజీ ఉంటుందని, బయట పడతామని ఆశతో ఉన్న బీజేపీకి.. నోటిఫికేషన్ మరితం ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల 5, 6 తారీఖుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ లోలోపల అనుమానమే ఉంది.
ఒకవేళ ఈ వారంలో నోటిఫికేషన్ రాకపోతే మరో నెల రోజుల పాటు సమయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ మాత్రం జోరు తగ్గకుండా రెండు పార్టీలు హుజురాబాద్ బరిలో తమ బలాలు ప్రదర్శిస్తున్నాయి. హరీశ్ రావు అక్కడే మకాం వేశాడు. మంత్రులూ అటే తిరుగుతున్నారు. కొత్తగా పదవి వచ్చినోళ్లు, పదవి వస్తుందని ఆశతో ఉన్నవాళ్లు, పదవి ఇస్తామని హామీ తీసుకున్న వాళ్లు అంతా హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఈటల రాజేందర్‌ను బొంద పెట్టేందుకు అంతా కలిసి గోతులు తోడుతున్నారు.
