(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఏందో ఏమో రామ‌న్న ఏం చేసినా వార్త‌ల్లోకెక్కుతున్నాడు. సోష‌ల్ మీడియాలో మీమ‌ర్స్‌కు మంచి సర‌కు అందిస్తున్నాడు. కాంగ్రెస్ సోష‌ల్ మీడియా మామూలుగా ఆడుకోవ‌డం లేదు రామ‌న్న‌ను. మ‌రి రామ‌న్న‌మో నెల‌కు కోట్లు కోట్లు గుమ్మ‌రించి సోష‌ల్ మీడియాను, యూట్యూబ‌ర్ల‌ను మేపుతున్నా.. దీనికి కౌంట‌ర్ ఇచ్చేంత సీన్ అక్క‌డ లేదు. క‌నీసం సర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ.. కూడా మీమ్స్ చేయ‌డం రావడం లేదు క‌రెక్టుగా. ఒక్క త‌ప్పు చేసి దాన్ని స‌రిదిద్దుకునేందుకు .. కౌంట‌ర్ ఇచ్చేందుకు రామ‌న్న చేస్తున్న ప‌నులు ఇంకా ఇంకా మీమ‌ర్స్‌కు చేతి నిండా ప‌నిక‌ల్పిస్తున్నాయి. మ‌రింత‌గా దొరికిపోతున్నాడు. ఆడుకుంటున్నారు. ఇప్పుడు దీని గురించే మ‌నం చెప్పుకునేది. మొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ రిసిప్ష‌న్ పోయాడు. క‌డుపును లోప‌లికి గుంజుకుంటూ బొర్ర‌క‌నిపించ‌కుండా చేసుకుంటూ ఓ చ‌లోక్తులు విసిరాడు. ఆ వీడియో దొరికింది కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు. బ‌ట్ట, పొట్ట అని తెగ ఆడుకున్నారు.

ఇక లాభం లేదనుకున్న రామ‌న్న ఏకంగా జిమ్ మెట్లెక్కాడు. ఇక పొట్ట దాచుకోవ‌డం నా వ‌ల్ల కావ‌డం లేదు.. చూడండి ఎలా స్లిమ్ అయి చూపిస్తానో..! అని దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చాన‌ని త‌న‌కు తానే భుజాలు చ‌రుచుకున్నాడు. కానీ దీన్నీ వ‌ద‌ల్లేదు. ఆ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా. బ్ర‌హ్మానందం, కోవై స‌ర‌ళ కామెడీ సీన్‌ను జ‌త చేసి .. లేటు వ‌య‌సులో బ్ర‌హ్మీ జిమ్ బాధ‌లు చూపిస్తూ.. దాన్ని రామ‌న్న‌కు ఆపాదించేసి.. ఈ వ‌య‌స్సులో ఎందుకే నీకీ తంటాలు అంటూ సెటైర్లు వేయ‌డం ప్రారంభించారు. ఇక ఇప్పుడు కొత్త స‌ర‌కు దొరికింది నెటిజ‌న్ల‌కు. అక్క‌డ చెల్లె జ‌నం కోసం నిరాహార‌దీక్ష చేస్తుంటే… నువ్వేందే ఇలా జిమ్‌లో చ‌మ‌ట‌లు తీస్తున్నావు..? జ‌నం కోసం పోరాడుతున్న‌దెవ‌రు? కొవ్వు క‌రిగించుకునేందుకు తంటాలు ప‌డుతున్న‌దెవ‌రు? అంటు వెంట‌ప‌డుతున్నారు. పాపం .. రామ‌న్న‌… ఏం చేసినా.. ఇలా క‌డుపుబ్బా న‌వ్వించి అంద‌రినీ ఆనందింప‌చేస్తున్నాడ‌నుకో.

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *