వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
కవిత తన రాజకీయ పార్టీని ఇంకా ఏర్పాటు చేయకముందే మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టారు. రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకునే క్రమంలో ఆమె తనదారి తను ఎంచుకున్న విషయం తెలిసిందే. జూన్‌లో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆలోపు వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో కొందరు లీడర్లు, ఉద్యమకారులు పోటీ చేయాలని భావించారు. దీంతో ఆమె వారందరికీ వీలుకా కామన్ సింబల్ వచ్చేలా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో చర్చలు జరిపి, ఆ గుర్తుతో పోటీ చేయించారు.
అయితే ఆమె ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేరు. కేవలం తను ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యమకారులు, ప్రజలతో మంచి సత్సంబంధాలుండి, ప్రజాసేవ చేయాలనుకున్న వారు సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు.. వారిని గెలిపించడని. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత టీమ్ విజయదుందుభి మోగించింది. సింహం గుర్తు సింగిల్‌గా పోటీ చేసి ఇక్కడి మున్సిపాలిటీనే కైవలం చేసుకోవడం రాజకీయాల్లో చర్చకు తెర తీసింది. ఇక్కడ మొత్తం 10 వార్డులకు గాను 8 వార్డుల్లో సింహం గుర్తు అభ్యర్థులు విజయం సాధించడం సంచలనం రేకెత్తించింది. ఆమె రాజకీయ పార్టీ రాకముందే ఇలా ఉంటే.. వచ్చిన తరువాత పోటీ ఎలా ఉంటుందోననే చర్చ ఇప్పట్నుంచే కొనసాగుతోంది.

