(దండుగుల శ్రీ‌నివాస్‌)

క‌ర్మ‌ఫ‌లం అంతే. అనుభ‌వించాల్సిందే. మాకు తిరుగేలేద‌నుకుంటారు. కాలం గిర్రున తిరిగి.. ప‌రిస్థితులు త‌ల‌కిందులు చేసేస్తుంది. క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని ఎన్నో మ‌లుపుల‌ను తిప్పి అహంకారాన్ని తుత్తునియ‌లు చేస్తోంది. అప్ప‌టి దాకా ఉక్కుపిడికిలిలా ఉన్న కోట చెక్కుచెదిరిపోతుంది. క‌ళా విహీన‌మై క‌కావిక‌ల‌మువుతుంది. ఇప్పుడిది యువ‌రాజు రామ‌న్న కోట నుంచే ప్రారంభ‌మైంది. ఏలినాటి శ‌ని.. అంటే ఏడున్న‌రేండ్లు వెంటాడుతుందంటారు. ఇది ఏడున్న‌ర ఏడున్న‌ర ప‌దిహేనేండ్లైనా వదిలేలా లేదు క‌ల్వ‌కుంట్ల కుటంబాన్ని. మరి ఆ ప‌దేళ్లు ఏలిన ఏలిక‌ల పాపం అంతింత కాదు క‌దా. స‌రే, ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే.. సిరిసిల్లా ఓట‌రు ఓ లేఖ రాశాడు రామ‌న్న‌కు. చేసిన పాపాలు, నాయ‌కులు ఆకృత్యాలు, అవినీతి, అన్యాయాలు, అన్యాక్రాంతం.. అన్నీ అన్నీ ఏక‌రువు పెట్టాడు. ఏన్నేండ్ల నుంచి దిగ‌మింగీ దిగ‌మింగీ ఇగో ఇప్పుడిలా బ‌య‌ట‌కు క‌క్కేశాడు.

మంచిగా, ముద్దుగా రామ‌న్నా.. అని సంబోధించి గౌర‌వ మ‌ర్యాద‌లు పాటిస్తూనే.. ఏకిపారేశాడు ప‌దేళ్ల ఏలిక‌ల దురాగ‌తాల‌ను. దుమ్మెత్తిపోశాడు. క‌ల్వ‌కుంట్ల కుటుంబ పాల‌న పాపాల‌పై. తిట్ల‌దండంకం అందుకున్నాడు నియంత పోక‌డ‌ల, నిష్టుర ప్ర‌భుత్వ ప‌నితీరుపై. శాప‌నార్ధాలు పెట్టాడు శనిలా దాపురించి త‌మ బంగారు భ‌విష్య‌త్‌ను కాల‌రాసిన కాల‌నాగుల‌పై. ఇది ఆ ఒక్క ఓట‌రు మ‌నోగ‌త‌మే కాదు. ఆ గులాబీ తోట‌లో వాడిపోయిన ఎంతో మంది మ‌నోభావాల‌కు ఇది అద్దం ప‌డుతున్న‌ది. ఇప్పుడిలా బ‌య‌ట‌ప‌డుతున్నారు. కేటీఆర్‌కు ఇది ముందే తెలిసున్న‌ట్టుంది. త‌ప్పిదారి మేం అధికారంలోకి వ‌స్తే.. అని బ‌హిరంగ వేదిక‌ల మీదే ఉన్న‌దున్న‌ట్టు మాట్లాడుతున్నాడు. అంటే మేం మ‌ళ్లీ రావ‌డం క‌ల్లేనంటున్నాడు. ఒకవేళ వ‌స్తే.. అని అనుమానంతో కూడిన అప‌న‌మ్మ‌క మాట‌ల‌ను వ‌దులుతున్నాడు.

త‌మ ప‌రిస్థితి ప్ర‌జ‌ల వ‌ద్ద ఎలా ఉందో.. గులాబీ కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు ఎలా ఉన్నాయో.. అవి భ‌గ్గుమ‌ని ఎప్పుడు ఎలా బ‌హిర్గ‌త‌మ‌వుతుందోన‌నే భ‌యం కేటీఆర్‌ను వెంటాడుతున్న‌ట్టుంది. అది ఇగో ఇలా నిజ‌మై బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ది. ఇంకా వ‌స్తాయి. వ‌స్తూనే ఉంటాయి. ఆయ‌న ఫామ్‌హౌజ్‌లో ఉంటాడు. ఈయ‌న మేం వ‌స్తేగిస్తీ.. చూస్కుంటాం.. మిమ్మ‌ల్ని అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని బెదిరించి బెదిరించి దేబిరించిపోతాడు. క‌ర్మ ఇలా ఉంది మ‌రి. ఎవ‌రేం చేయ‌గ‌ల‌రు?

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

త‌ప్పిదారి మేం గెలిస్తే…!? రామ‌న్న మాట‌ల్లో ఆంత‌ర్య‌మేమిటో..!? అంటే గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని ఒప్పుకోవ‌డ‌మా? ఒక‌వేళ గెలిస్తే మిమ్మ‌ల్ని వ‌ద‌ల‌బోమ‌నే బెదిరింపులా? ఒక‌వేళ మేం గెలిస్తే.. అంటే.. ఆ గెలుపు ఆశ‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయ‌ని ఒప్పుకున్న‌ట్టా? గెల‌వ‌డం క‌ష్ట‌మే కానీ… గెలిస్తే మాత్రం ప‌గ‌లు, ప్ర‌తీకారాల‌కే పరిమిత‌మ‌వుతార‌ని చెప్పుకోవ‌డ‌మా? మీరు ప్ర‌తీకారాలు తీర్చుకునేందుకు మిమ్మ‌ల్ని గెలిపించాలా ప్ర‌జ‌లు.. హుందాత‌నం వీడి.. గ‌ల్లీ లీడ‌ర్‌గా మారిపోయిన కేటీఆర్‌.. కేసీఆర్ ఆన‌వాళ్ల‌ను ఎవ‌రో కాదు.. కొడుకే తుడిచేసేలా ఉన్నాడు.. జ‌నం ఇదే అనుకుంటున్నారు..! జ‌ర వెన‌కాముందు చూస్కోండ్రీ… ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల కోసం పోరాడండి.. బాల‌య్య‌బాబు సినిమా డైలాగులు కాదు మీ నుంచి జ‌నం కోరుకునేది!