(దండుగుల శ్రీ‌నివాస్‌)

సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ స్పీక‌ర్ కేఆర్ సురేశ్‌రెడ్డి .. త‌న వార‌స‌త్వాన్ని రాజ‌కీయాల్లోకి దింపుతున్నాడు. ఆయ‌న త‌న కొడుకు అమిత్‌రెడ్డిని ఆర్మూర్ బ‌రి నుంచి దింపేందుకు .. ఇక్క‌డి నుంచి రాజ‌కీయ ఆరంగేట్రం చేపించేందుకు పావులు క‌దుపుతున్నాడు. ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేఆర్ సురేశ్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న ఇక‌పై ఆక్టివ్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని కొడుకుకు ఇవ్వ‌డం ద్వారా రాజ‌కీయంగా త‌న వార‌స‌త్వానికి క‌లిసి వ‌స్తుంద‌ని ఆయన భావిస్తున్నారు.

కానీ ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్నందున చివ‌రి ఏడాదిలో రంగంలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.దీనిపై అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్న‌ది. చాలా చోట్ల ఇంచార్జిల‌ను మార్చాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడు. ఇందులో మొద‌టిది ఆర్మూర్‌. కేఆర్ సురేశ్‌రెడ్డి వియ్యంకుడు, అమిత్‌రెడ్డి మామ‌…. కూడా ఆంధ్ర రాజ‌కీయాల్లో యాక్టివ్‌లో ఉన్నారు. కీల‌క ప‌ద‌విలో ఉన్నారు. దీంతో అమిత్‌ను రాజ‌కీయ ఆరంగేట్రం చేయ‌డ‌మే త‌రువాయిగా ఉంది. ఆర్మూర్‌లో కూడా ఇదిప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది.

 

Dandugula Srinivas

Senior Journalist

7661066999