వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
ఫ్రీబస్సును గేలి చేశాడు కేటీఆర్. కేసీఆరూ ఏమీ తక్కువ కాదు. ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టి ఆడోళ్లకు ఆడోళ్లకు మధ్య లొల్లి పెట్టించిండు రేవంత్‌రెడ్డి అని కామెంట్ చేశాడు. కానీ ఈ ఫ్రీ బస్సు పథకం ఇప్పుడు అమెరికాను తాకింది. అక్కడ పోటీలో విజేతగా నిలిచింది. అక్కడి జనామోదం పొంది… ఎన్నికలో ఘన విజయానికి ఈ సింగిల్ పథకం తోడయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న అన్ని పథకాలు విప్లవాత్మకమైనవే. జనాలకు చేరవైనవే. వారి నాడి తెలిసి ప్రవేశపెట్టినవే. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు, సన్నబియ్యం పథకం.. పేద జనానికి ఎంత మేలు చేశాయంటే..ప్రజా ప్రభుత్వం అంటే ఇదీ..! అని వారు రొమ్ము విరుచుకు చెప్పేలా. ఆశీర్వదించేలా. ఇంతకు మించిన మరో సాహసోపేతమైన, విప్లవాత్మకమైన నిర్ణయం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.
అవును.. ఇది ఏ సర్కార్ చేయని నిర్ణయమే. కనీసం ఇలాంటి ఆలోచన చేయాలంటేనే ఇతర పార్టీలు జంకుతాయి. భయపడతాయి. కానీ ఇప్నుడు రేవంత్ సర్కార్ అనుకున్న లక్ష్యం దిశగా, బీసీలకు పెద్ద పీట వేసేలా విద్యా, ఉపాధి, రాజకీయపరమైన అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. చెప్పిందే చేస్తాం.. చేసేదే చెప్తామనే విధమైన పాలనను అందిస్తున్న సర్కార్.. ఇప్పుడు ఇందులో భాగంగానే ఓ అడుగు ముందుకేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. ఇలాంటి నిర్ణయాలు, వాటి అమలు చేసే దమ్ము ఇతర పార్టీలకు లేదు.. అది కేవలం కాంగ్రెస్ సాధ్యమని మరోసారి నిరూపించింది. అందుకే రేవంత్ రెడ్డి పేదోడి రాబిన్‌హుడ్ అయ్యాడు.
కేటీఆర్ ఓ నియంత కొడుకుగా, అహంకారిగా మిగిలాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీరిద్దరి మధ్యే జరుగుతున్నది. ప్రజాపాలన అందిస్తున్న రేవంత్‌కు , నియంత కొడుకైన అహంకారి కేటీఆర్‌కు మధ్య…ఈ ఎన్నిక. అందుకే ఓటరుకు ఇప్పటికే గురి కుదిరింది దీనిపై. అహంకారాన్ని చిత్తుగా ఓడించెందుకు రెడీ అయ్యారు. మరోసారి గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు.
