(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప‌త్రికా స్వేచ్ఛ పేరుతో, జ‌ర్న‌లిజం ముసుగులో ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుని.. పొద్దున్న లేస్తే వాళ్ల‌నీ వీళ్ల‌నీ అమ్మ‌నాబూతులు తిట్ట‌డం, ఏతులు కొట్ట‌డం, ఎడ్డిచ్చి ప‌ల్లికిలించ‌డం.. దీన్ని చూసి అబ్బ ఎంత బాగా చెప్పావ్‌.. అని అనంగానే ఉబ్బిత‌బ్బిబ్బైపోయి… నాకు తిరుగేలేద‌నుకోవ‌డం.. అభిమానులు త‌న అడుగులకు మ‌డుగులొత్తుతార‌నుకోవ‌డం వెర్రితనం. బీసీ ముసుగేసుకున్నాం కాబ‌ట్టి.. వాళ్లంతా గొర్రెల్లెక్క త‌న వెంటే పోలోమ‌ని ప‌రుగులెత్తుతూ వ‌స్తార‌నుకోవ‌డం మ‌తిత‌ప్పిన ప‌ని. ఓ రాజ‌కీయ పార్టీ పెట్టి జ‌నం మ‌ధ్య‌కు పోతే త‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టి ఆకాశానికెత్తుతార‌ని అనుకోవ‌డం.. మ‌రీ త‌న‌కు తాను హీరోగా అతిగా ఊహించుకోవ‌డం.. ఇవ‌న్నీ తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో రూడీ అయిపోయాయి.

త‌న యూట్యూబ్ చానెల్‌లో జ‌ర్న‌లిజం కూడా సిగ్గుప‌డేలా ఎడ్డిచ్చుడు, బూతులు తిట్టుడు, బహిరంగ బెదిరింపులు.. ఇదీ చేసిన ఘ‌న‌కార్యాలు. ఇక దీనికి ఒక రాజ‌కీయ పార్టీ. ఇక మాకు తిరుగేలేద‌ని ఇలా జ‌నం ముందుకు వ‌స్తే మ‌న స‌త్తా ఏందో.. స్టామినా ఏపాటిదో ఎక్స్ రే తీసి జ‌నం మ‌ల్ల‌న్న చేతికిచ్చారు ఇలా. డిపాజిట్లు గ‌ల్లంతు చేసి. అందుకే రాజ‌కీయ పార్టీ పెట్ట‌డ‌మంటే యూట్యూబ్ చానెల్ న‌డిపినంత వీజీ కాదు. జ‌నం మ‌న‌సు గెలుచుకుని ఓట్లు రాలేలా చేసుకోవాలంటే.. పొద్దున్నే పేప‌ర్లో వ‌చ్చి వార్త‌లు చ‌ద‌వుతూ త‌న సొంత భాష్యాలు దానికి ఆపాదించి బూతులు జోడించి, వెట‌కారాల కారాలు హీరోయిజం అనుకోవ‌డం కాదు. ఇలా చేయ‌డం వల్ల జ‌నం కామెడీ పీస్‌గానే చూశారు త‌ప్ప‌. సీరియ‌స్‌గా ఆలోచించ‌లేదు. అందుకే ఓట్లు రాల‌లేదు.

క‌నీసం అదో పార్టీ. దాని గుర్తిది అని కూడా జ‌నానికి తెలియ‌దు. ప్ర‌జాక్షేత్రంలో దిగితే అట్ల‌నే ఉంటుంది మ‌రి. పాల‌కు పాలు నీళ్ల‌కు నీళ్లు….దిగితే కానీ తెల‌వ‌దు లోతెంతో..! జ‌నంతో మ‌మేక‌మ‌వుతే గానీ తెలియ‌దు వారి అభీష్ట‌మేంటో..? ఆకాంక్ష‌లేమిటో?

Dandugula Srinivas

Senior jOURNALIST

7661066999