వాస్త‌వం ప్ర‌తినిధి – మంచిర్యాల‌:

చెన్నూరు మున్సిపాలిటీలో కుల సంఘాల నేతలతో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గౌడ కుల సంఘాల నేతలతో ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించిన మంత్రి, మున్సిపాలిటీలోని 16వ వార్డులో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గౌడ కుల సంఘానికి భవన నిర్మాణం కోసం రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తూ సంబంధిత మంజూరు పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి సంఘ నాయకులకు అందజేశారు. ప్రజల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న మంత్రి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి ప్రజలను కోరారు. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.