రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం తన మాతృమూర్తి మంజులమ్మ ద్వాదశదినకర్మ రోజున సాయంత్రం తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి ఘాట్ వద్ద ఓదార్చతరంకాని విధంగా రోధించారు. అక్కడ ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమైన విషాద సందర్భం అది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి కేసిఆర్ తో మలి దశ ఉద్యమంలో అడుగులో అడుగు వేసిన తొలిదశ ఉద్యమకారుడు.
తెలంగాణ నినాదాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నోట పలికించే క్రమంలో ఓటములు అని తెలిసి కూడా.. కేసీఆర్ కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కోసం పోటీలో నిలిచిన తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి ముందే తాను ఎమ్మెల్యే అయ్యి.. అయ్యో నాన్న ఎమ్మెల్యే కాలేదే అని బాధ పడుతున్న సమయంలో తండ్రి వేముల సురేందర్ రెడ్డి మృతి చెందారు. ఆ బాధ నుంచి ఊరట రాక ముందే అమ్మ మంజులమ్మ మృతి చెందారు. మంగళ వారం ఉదయం ఘాట్ వద్ద మంత్రి వేముల తీవ్ర రోదన సమయంలో అక్కడ సర్వత్రా ఇదే కన్నీటి చర్చ నెలకొన్నది.