చౌటుప్పల్:

చౌటుప్పల్ మండలం డి. నాగారం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం సందర్బంగా ప్రజల నుండి మంత్రికి విశేష స్పందన లభించింది. మహిళలు బొట్టుపెట్టి తమ ఇంటికి స్వాగతం పలికి కారు గుర్తుకే ఓటు వేస్తామని భరోసానిచ్చారు.

ప్రచారంలో భాగంగా ఓ మహిళను మంత్రి ఓటు వేయాలని కోరగా…కేసిఆర్ పెడుతున్న బువ్వ తింటున్నాం.పెన్షన్ తీసుకుంటున్నాం కారు గుర్తుకే మా ఓటు వేస్తామని ఆప్యాయంగా చేతులు జోడించి తెలిపింది. పద్మశాలి కాలనీలో నేతన్నల చేనేత మగ్గాలపై వస్త్రాలను నేస్తున్న తీరును పరిశీలించారు. వారి కోరిక మేరకు కొద్ది సేపు వారితో కలిసి వస్త్రాలు నేచారు. చేనేత పై జీఎస్టీ వేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వం అన్నారు. కెటిఆర్ గారు నేతన్నలకు మద్దతుగా,వారి కష్టం తెలిసిన వ్యక్తిగా చేనేతపై జీఎస్టీ ఎత్తి వేయాలని కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నారని మంత్రి వేముల తెలిపారు.

అంతే కాకుండా ప్రతి గడపకు టిఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్న తీరు పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు చేసిన మేలును ఎన్నటికి మర్చిపోరని,కేసిఆర్ వారికి ఏమీ ఇచ్చాడో వారి మాటల్లోనే చెప్తున్నారని ఇది గొప్ప మార్పుకు నాంది అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. రాజ గోపాల్ రెడ్డి తన స్వార్థంతో 18వేల కోట్ల కోసం తెచ్చిన ఎన్నిక అని, ఓటుతో బీజేపీ మోడీకి రాజగోపాల్ రెడ్డికి బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నామని ప్రజలే చెప్తున్నారని అన్నారు.

రైతు బంధు,రైతు భీమా,24 గంటల ఉచిత విద్యుత్,ఆసరా పెన్షన్లు,దళిత బంధు,కళ్యాణ లక్ష్మి,కేసిఆర్ కిట్,కుల వృత్తులకు చేయూత ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మునుగోడు ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ వచ్చేలా లేదని,కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండే అవకాశం ఉన్నదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


కేసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది వైపే ఉంటామని పార్టీలో చేరుతున్న యువత – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న బీఎస్పీ కి చెందిన యువకులు

చౌటుప్పల్:

మునుగోడు లో టిఆర్ఎస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై,కేసిఆర్ చేస్తున్న అభివృద్ది వైపే ఉంటామని పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే బీజేపీ వైఖరి యువతకు అర్థమవుతోందని చెప్పారు. ఈ సందర్బంగా చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామం 8వ వార్డు నుంచి బిఎస్పీకి చెందిన నాయకులు వెంకటేష్,మల్లేష్,ఏచూరి గిరి,నాగరాజు,ఏచూరి అనిల్,వినోద్ పలువురు యువకులు మంత్రి సమక్షంలో టీఎర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని వారికి మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, వేం యుగంధర్ రెడ్డి, వేం దేవేందర్ రెడ్డి,సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

You missed