అది బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాల‌యం.. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్రెస్‌మీట్.. అంతా హ‌డావుడిగా ఉంది. ఇంత‌లో ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వేదిక మీద ఓ ప్ర‌శ్నాప‌త్రాన్ని చూపాడు. ఏమిటా అని అంతా చూస్తున్నారు. అది న‌మ‌స్తే తెలంగాణ విలేక‌రి రాసిన ఓ ప్ర‌శ్నాప‌త్రం. అందులో ప్ర‌శ్న‌లను కేంద్ర మంత్రితో అడ‌గాల‌ని ఆ రిపోర్ట‌ర్ అంద‌రి విలేక‌రుల‌కు వాట్సాప్ లో షేర్ చేశాడు. దాన్ని ఎవ‌రో విలేక‌రి బండి సంజ‌య్‌కు చేర వేశాడు. దీన్ని ప్రెస్ మీట్‌లో బ‌ట్ట‌బ‌య‌లు చేసిన బండి… నువ్వు చెబితే త‌ప్ప మా విలేక‌రుల‌కు ప్ర‌శ్న‌లు అడ‌గ‌డానికి రాదా..? అంటూ న‌మ‌స్తే విలేక‌రిని ఉద్దేశించి తిట్ల దండ‌క‌మందుకున్నాడు. ఇక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని న‌మ‌స్తే విలేక‌రిని, తెలంగాణ టుడే, టీ న్యూస్ విలేక‌రిని బ‌య‌ట‌కు పంపారు.

ఇద్ద‌రిదీ రాంగే. ప్ర‌శ్న‌లు అడగండ‌ని ఎవ‌రో చెబితే త‌ప్ప మిగితా విలేక‌రుల‌కు తెల‌వ‌దా..? త‌మ‌కు తామే మేథావిన‌నే భ్ర‌మించే ఆ న‌మ‌స్తే విలేక‌రి పైన టీఆరెస్ పెద్ద‌ల‌తో మెప్పు పొందేందుకు ఇలా తంటాలు ప‌డి బ‌య‌ట‌కు గెంటివేయ‌బ‌డ్డాడు. ఎలాంటి ప్ర‌శ్న‌లు ఎవ‌రు వేసినా.. దానికి లీడ‌ర్ అనేవాడు స‌మాధానం చెప్పాలి. చెప్పేందుకు జంక‌డ‌మెందుకు..? ప్ర‌శ్న‌లు అడిగితే బ‌య‌ట‌కు పంపే ప‌రికి పంద వేషాలెందుకు…? ఇద్ద‌రిదీ త‌ప్పే.. ఇప్పుడు హైద‌రాబాద్ మీడియా స‌ర్కిళ్ల‌లో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది…