మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారి ప్రశంసల జల్లు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు
వారి తండ్రి గారు స్వర్గీయ సురేందర్ రెడ్డి అంకుల్ తో నాకు ఉద్యమ అనుబందం ఉన్నది.
ప్రశాంత్ రెడ్డి గారు మాతో మీటింగ్ లో ఉంటాడు.బాల్కొండ నియోజకవర్గం గురించే ఆలోచిస్తారు
ఆయన ధ్యాస అంతా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి గురించే..
ఎన్నుకున్న ప్రజలకు ఇంకా ఏదైనా చేయాలనే తపన ఆయనది
ముఖ్యమంత్రి గారికి నమ్మకమైన వ్యక్తి
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చి వారి ప్రేమను చురగొన్నాడు.
నేడు ఆర్ అండ్ బి ,గృహ నిర్మాణ,శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు గొప్పగా నిర్వహిస్తున్నారు.
ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే భీంగల్, వెల్పూర్,బాల్కొండ అభివృద్ధి జరిగింది.
24 చెక్ డ్యాంలు కట్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఒక్కో చెక్ డ్యాం లో నీళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే విధంగా నిర్మించి నీటి గోస తీర్చారు.
