వ‌రద‌ల కార‌ణంగా ఓ అమ్మాయికి వైద్యం అందించ‌లేని దీనస్థితిలో ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని ఇద్ద‌రు అన్న‌లు, త‌ల్లి వాగును దాటిన వీడియో చాలా మందిని క‌దిలించింది. ఇది చెన్నూరు నియోజ‌వ‌క‌ర్గంలో జ‌రిగింది. ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఇక్క‌డి ప‌రిస్థితులు ప‌ట్టించుకోకుండా హుజురాబాద్‌లో ప్ర‌చారానికి పోయాడ‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లకు దిగారు. కొంద‌రైతే ఇక్క‌డ ఇంత భీభ‌త్సం జ‌రుగుతుంటే .. ఆయ‌న మాత్రం అక్క‌డ హాయిగా నిద్ర పోతున్నాడ‌ని.. హుజురాబాద్‌లో బాల్క సుమ‌న్ నిద్ర‌పోతున్న ఫోటోతో ట్రోల్ చేశారు. దీంతో బాల్క సుమ‌న్‌కు త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది. వెంట‌నే ఇయ్యాల త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగాడు. వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన పంట వివ‌రాల‌ను తెలుసుకున్నాడు. బాధితుల‌తో మాట్లాడాడు. పొలం బాట ప‌ట్టాడు. రైతుల‌తో మ‌మేక‌మ‌య్యాడు.