తప్పు తెలుసుకోవడం ఉత్తముడి లక్షణం. ఆ తప్పు జరిగిందని ఒప్పుకోవడం పరిపక్వత వ్యక్తిత్వానికి నిదర్శనం. చేసిన తప్పుకు చెంపలేసుకుని, మళ్లీ ఆ తప్పు జరకుండా చూస్తానని చెప్పడం జవాబుదారీతనం, ఓ బాధ్యత, ఓ లీడర్ లక్షణం. అవును. ఇప్పుడు కేటీఆర్‌లో ఓ పరిపక్వత నిండిన నాయకుడు కనిపిస్తున్నాడు. జవాబుదారీతనం గుర్తెరిగిన వ్యక్తిత్వం కలిగిన లీడర్ కనిపిస్తున్నాడు.
మొన్నటికి మొన్న ఈట్ కా జవాబ్ పత్తర్ సే అని ఆవేశంగా మాట్లాడిన ఈ నేతే..మీరు ఒకటంటే మేం పదంటామని వాళ్ల ఉచ్చులో ఇరుక్కున్న యువనేతే.. మంత్రి మల్లారెడ్డి తొడగొడితే సంతోష పడి ఎగిరిగంతేసిన మన భావి సీయేం.. ఈ రోజు ఓ పరిపక్వత చెందిన నాయకుడిలా మాట్లాడాడు. నిజాన్ని ఒప్పుకున్నాడు. తప్పు సరిదిద్దుకుంటానన్నాడు. చెంపలేసుకున్నాడు. తెగ నచ్చేశాడు. కీపిటప్ కేటీఆర్.. ఇదే నీలో మేం కోరుకున్నది.