డబుల్‌బెడ్ రూం ఇండ్లు అనుకున్న విధంగా నిర్మాణం జరగలేదు. కొన్ని చోట్ట కట్టి కూడా ఇంకా ఇవ్వలేదు. లబ్దిదారుల ఎంపిక చాలా కష్టంగా మారింది. ఉన్నవి కొన్ని.. వచ్చిన దరఖాస్తులు వేలల్లో. అధికారులు నిజమైన అర్హత కలిగిన వారినే ఎంపిక చేశారు. ఎంపిక ప్రక్రియ బాగానే జరిగింది. అందులోనూ… లాటరీ సిస్టం ద్వారా పారదర్శకంగా వీటిని ఇవ్వాలని అనుకున్నారు. ఇందులో కిరికిరి ఉండదు. రాని వారికి మళ్లీ కట్టించి ఇండ్లు ఇస్తామని చెప్తారు. ఆగుతారు అప్పటి వరకు. తప్పదు మరి. కానీ ఇలా నిర్మాణమైన ఇండ్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలుసా..? ఎమ్మెల్యేల జోక్యమే.అసలు ఎమ్మెల్యేల ప్రమేయం ఉండద్దని కేసీఆర్ అన్నాడు. కానీ పార్టీకి ఉపయోగం జరగాలే కదా. కార్యకర్తలుకు, నాయకులకు న్యాయం జరగాలె కదా. అందుకే వారి జోక్యం తప్పలేదు. అందుకే ఈ పథకం అలా ఎటూ కాకుండా పోయింది.
ఇప్పుడు దళితబంధు పథకానికి లబ్దిదారుల ఎంపిక ఏకంగా ఎమ్మెల్యేలకే అప్పజెప్పాడు కేసీఆర్. ఎమ్మెల్యేలకు ఇస్తే అంతా టీఆరెస్ వాళ్లే ఎంపిక అవుతారు. అందులో డౌటేముంది… ? మరి మిగిలిన వారి పరిస్థితి ఏందీ..? నియోజకవర్గానికి వంద మంది అన్నారు. ఆ వంద మందిలో అధికార పార్టీకి చెందిన వారే మెజార్టీగా ఉంటారు. చోటోమోటా లీడర్లు తెచ్చిన పేర్లనే ఎమ్మెల్యే ఓకే చేస్తాడు. ఇక్కడే ఈ పథకం ఉద్దేశం పక్కదారి పడుతుంది. దారితప్పి అధికార పార్టీకి ఇబ్బందికర పరస్థితులు తెచ్చిపెడుతుంది. ఎమ్మెల్యేల జోక్యం లేకుండా అర్హులైన వారందరి పేర్లు తీసుకుని అందరి సమక్షంలో లాటరీ పద్దతిలో అర్హులను ఎంపిక చేస్తే…
ఇంత పెద్ద పథకం పెట్టి.. ఎమ్మెల్యేల జోక్యం లేకుండానా..? అసంభవం.. మమ్మల్నెవడు పట్టించుకుంటాడు తర్వాత.. అని అంటారా..? ఐతే కానీ.. దీని పర్యవసానాలు తొందరలోనే తెలుస్తాయి.
కేసీఆర్‌కు.
