నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు ఎంపీకి విన్నవించాడు. 2016 జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని నడిబొడ్డున దళిత యువకులైన రవి, తలారి సత్యంలను తన బంధువు టిప్పర్ తో హత్య చేయించాడని తెలిపాడు. ఈ హత్య పై ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దళిత యువకుల హత్య కేసులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సీబీఐ విచారణ చేయించాలని కోరాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తూ దళిత బంధు పేరుతో మరోసారి రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు.