(దండుగుల శ్రీనివాస్)
కవితపై సర్కార్ సానుభూతి చూపిస్తోంది. ఆమెను ఆ కుటుంబం బలవంతంగా, మోసపూరితంగా బయటకు గెంటేశారనే భావనలో ఉంది. ఆమెను రాజకీయంగా ఏకాకిని చేశారనే సింపతీ కననబరుస్తోంది. అంతిమంగా ఆమె రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని కోల్పోవడాన్ని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అందుకే ఆమె రాజీనామాను ఆమోదం తెలపడం లేదు. ఆమె ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగడాన్ని స్వాగతిస్తున్నది సర్కార్. ఎమ్మెల్సీ కవితగానే ఆమె ఉండాలని ఇష్టపడుతున్నది. ఇకపై ఆమె మాజీ ఎమ్మెల్సీ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ కవితగానే ఉంటుంది. పార్టీ సస్పెండ్ చేసిన తరువాత ఆమె హుందాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది.
అదీ స్పీకర్ ఫార్మాట్‌లో. స్పీకర్ కు కూడా ఫోన్ చేసి చెప్పింది. కానీ అక్కడ నుంచి నో రిప్లై. నో రెస్పాన్స్. ఇకపై ఎటువంటి రెస్పాన్స్ ఉండదు కూడా. అంతే. ఇప్పుడు కవిత ఉన్నదున్నట్టుగా మాట్లాడుతోంది. ఆమెకు మొన్నటి వరకు ఉన్న అడ్డు తెరలు తొలిగిపోయాయి. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. తనకు కాంగ్రెస్, బీజేపీ ఎలాగో.. బీఆరెస్ కూడా అలాగే. ఏ పార్టీని ఓన్ చేసుకోను అని చెప్పేసింది. అందుకే అన్ని పార్టీల లోపాలపై తను మాట్లాడాలనుకున్నది. దీంతో మరిన్ని విషయాలు, రహస్యాలు వెలుగులోకి రానున్నాయి. కీలకమైన కాళేశ్వరంపై కవిత చాలా విషయాలు బయటపెట్టింది. ఇందులో భారీ అవినీతి జరిగిందని కూడా తేల్చేసింది. దీనికి కారణం హరీశ్‌రావేనన్నది.
ఇంకా దయ్యాల బాగోతాలు బయటపెట్టేందుకు ఆమె రెడీగా ఉన్నది. ఆ మేరకు ఆమె, ఆమె టీం ప్రిపేర్ అవుతున్నది. సోషల్ మీడియా టీమ్‌ను కూడా బలోపేతం చేసుకుంటూ వస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు ఓ వేదికగా ఎమ్మెల్సీ పదవి ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఆమె రాజీనామాను ఆమోదించడం లేదు. ఆమోదించదు కూడా.
Dandugula Srinivas
Senior Journlist
7661066999