వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
సిటీలో కాంగ్రెస్ పుంజుకుంటున్నది. ఇక్కడ ఒకప్పుడు బీఆరెస్‌దే హవా. పదేండ్లలో బీఆరెస్ మొత్తం సిటీని తన హస్తగతం చేసుకున్నది. చాలా మంది సెటిలర్లు కూడా ఇకపై బీఆరెస్ ఇక్కడ అధికారంలో ఉండబోతుందని అనుకుని దానివైపే మొగ్గు చూపారు. కానీ గడిచిన ఎన్నికల్లో ట్రెండ్ మారింది. మార్పు మొదలైంది. బీఆరెస్ అధినేత కేసీఆర్, అతని కొడుకు కేటీఆర్ చర్యలకు జనం విసిగిపోయారు. ఆ అహంకార పాలనకు చరమగీతం పాడాలనుకున్నారు. అంతా అనుకున్నట్టే అదే జరిగింది. ఫామ్‌హౌజ్‌కు పంపారు కేసీఆర్‌ను. తనను ఓడిస్తే మీరే నష్టపోతారు. నేను మంచిగా ఫామ్‌హౌజ్‌లో పండుకుంటా.. అని కూడా బెదిరించాడు చివరకు కేసీఆర్.
ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు. మీకు తగిన గుణపాఠం.. ఓడించి ఇంటికి పంపడమేనని డిసైడ్ అయ్యారు. ఓడించారు. సాగనంపారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇది బీఆరెస్‌దే. ఇదే అదనుగా బీఆరెస్ తన సీటును తను పదిలం చేసుకోవడానికి చేయని చర్యలు లేవు. ప్రచారాలకు అంతూ లేదు. కానీ జనం వారిని నమ్మడం లేదు. సిటీలో కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. ఏ సర్వే చేసినా.. అన్నిటా కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నాయి ఫలితాలు. రెండు, మూడు స్థానాలకే బీఆరెస్, బీజేపీ పరిమితమవుతోంది. దీన్ని గెలవడం ద్వారా ప్రజల వద్ద తమ పరపతి ఇంకా తగ్గలేదని విర్రవీగేందుకు తహతహలాడుతోంది బీఆరెస్. కానీ అక్కడ అంత సీన్ లేదని ముందే తేలిపోయింది. వారికి కూడా ఈ సంగతి తెలిసిపోయింది. ఉప ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని తొడలు చరిచిన కేటీఆర్‌కు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరోసారి గర్వభంగం కలిగించనుంది.