(దండుగుల శ్రీనివాస్)
అది ఆర్జీవీ వోడ్కా మత్తులాంటిదేనా? అంతేనంటున్నారంతా. పాపం.. రాహుల్ రామకృష్ణ.. పూర్వశ్రమంలో జర్నలిస్టే అయినా.. ప్రశ్నించే విధానం ఇది కాదేమో? సమయం, సందర్భమూ తెలియలేదంటూ..ఒళ్లు, సోయి తెల్వకుండానే ట్వీట్ చేశాడేమో. అంతేనంటున్నారంతా. తన మానాన తను నటించుకుంటూ పోయి నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాడు. గో… ప్ప నటుడేం కాకపోయినా.. పర్వాలేదు. తెలంగాణ యాస, భాష కలిసొచ్చింది. గతంలో తెలంగాణ టుడేలో పనిచేశాడు. కేసీఆర్ అంటే అభిమానం. బాగానే ఉంది.
మరి ఇదేందివ్యా రాహుల్. హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడి మునిగితే.. అది రేవంత్ తప్పేనంటావా? అంతకు ముందు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసలు ఎక్కడా చుక్క నీరు కూడా నిలవలేదంటావా? నువ్వేం జర్నలిస్టువయ్యా బాబు…అభిమానం ఓకే. బానిస అభిమానం పరమ రోతగా ఉంది. ఇప్పుడు ఇదే నీకు చెత్త పేరును తీసుకొచ్చిపెట్టింది. కచ్చితంగా నువ్వు తప్పతాగి ఓళ్లూ పై తెలియకుండా చేసిన ఘనకార్యమే అదని డిసైడ్ అయిపోయారు జనమంతా. ఆ వెంటనే నువ్వు దాన్ని డిలేట్ చేయడం ఎందుకయ్యా? నీ కన్నా ఆ తాగుబోతు ఆర్జీవే నయం.. తాగి ఏదో వాగినా.. దానికి కట్టుబడే ఉంటాడు. కేసులు గట్రా ఎదుర్కొంటాడు. తాగలనిపిస్తే తాగాలి. పీకలదాకైనా తాగొచ్చు. కానీ చేతిలో స్టీరింగ్ మాత్రం ఉండొద్దు.. సెల్‌ఫోన్ అస్సల్ అస్సల్ ఉండొద్దు. ఇది పాటించు చాలు.