(వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్)
మెట్రోరైల్ ప్రాజెక్టుకు ఇక మెరుగులు అద్దే పనిలో పడింది సర్కార్. ఇది మరింత దూకుడుగా పరుగులెత్తేందుకు తన హస్తగతం చేసుకున్నది ప్రభుత్వం. ప్రైవేటీకరణ నుంచి మెట్రో కు విముక్తిని ప్రసాదించి తన ఆదీనంలోకి తీసుకున్నది రేవంత్ సర్కార్. ఎక్కడైనా ఇప్పుడు నడుస్తున్నదేందీ..? అంతా ప్రైవేటీకరణ. ప్రభుత్వం .. మెల్లగా ఒక్కో ప్రాజెక్టులను, సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ పోవడం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. సర్కారే ప్రైవేటు నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నది మెట్రో రైల్‌ను. గత సర్కార్ దీన్ని అధఃపాతాళానికి పట్టిస్తే.. ఈ సర్కార్ దీన్ని మూలమూలలకు విస్తరింపజేసి జనానికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలనుకుంటున్నది.
రెండోస్థానం నుంచి 9 స్థానానికి దీని స్టామినా పడిపోయినప్పుడే .. ఆ సర్కార్‌లో జరిగిన డెవలప్‌మెంట్ ఏందో అర్థమైపోతున్నది. మెట్రో 2 దశ ఇంకా పట్టాలెక్కకుండా.. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారయ్యింది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పరిస్థితి. మెట్రో ఫెసిలిటీ ఉన్నదా అంటే ఉన్నది. అంతే. దీని వల్ల ట్రాఫిక్ కష్టాలు తీరలే లేదు. ఈ క్రమంలో సర్కార్ సంస్కరణ పరమైన నిర్ణయంలో భాగంగా ఎల్ అండ్ టీ నుంచి దీన్ని హస్తగతం చేసుకున్నది. వెంటనే రెండో దశ మెట్రో లైన్ చకా చకా పట్టాలెక్కనున్నది. దీన్ని ఎల్ అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడే ఓ సవాల్‌గా స్వీకరించింది సర్కార్. 8 కొత్త లైన్లు, 163 కి. మీ ట్రాక్.. ఇప్పుడు సర్కార్ ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యం సాధనకు వడివడిగ ఇక అడుగులు పడనున్నాయి. కానీ దీన్ని కూడా కేటీఆర్ వ్యతిరేకించడం మరోసారి తనకు తానుగా సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నట్టే అయ్యింది. ఎల్అండ్‌టీ తో బీఆరెస్ సర్కార్‌కు గతంలో విడదీయరాని బంధం ఉంది.
ఈ ప్రాజెక్టు నుంచి కేటీఆర్‌కు కమీషన్లు వస్తున్నాయనేది ఓ చర్చ. ఇప్పుడు ఇది ఆగిపోవడం మూలంగానే కేటీఆర్ గగ్గోలు పెడుతున్నాడనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతున్నాయి. అవసరంగా ఏదో ఒక విషయంలో వేలు పెట్టి పెంట పెంట చేసుకోవడం కేటీఆర్‌కు అలవాటుగా, పొరపాటుగా, గ్రహపాటుగా మారింది. సర్కార్ హస్తగతం చేసుకోవడం ద్వారా జనాలకు ఎలాంటి నష్టమో కేటీఆర్‌కే తెలియాలి. తాము చేసిన తప్పిదాలను కెలికి మరీ మరోసారి బయటపెట్టుకోవడమే తప్ప.. కేటీఆర్ ఆరోపణల్లో, వాదనల్లో ఏమాత్రం పసలేదు. పసలేక పోగా తనే తద్వారా సెల్ప్‌గోల్ అవుతున్నాడు. ఇలా మెట్రో విషయంలో మరోసారి కేటీఆర్ కామెంట్లు బూమరాంగ్ అయి కూర్చున్నాయి. పిటీ కేటీఆర్.