కరోనా మొదటి, రెండవ వేవ్‌లో చాలా మంది మృత్యువాత పడ్డారు. పనులు లేక అర్థాకలితో సగం చచ్చిన జనాలను కరోనా మాటేసి కాటేసి చంపేసింది. రెండో వేవ్‌లోనైతే ఆక్సిజన్ కూడా దొరకలేదు. ఎప్పుడూ ఇంతటి దారుణ పరిస్తితి వస్తుందని ఊహించలేదెవ్వరు. అసలే సర్కారు దవఖానాలు. అందులోని గ్రామీణ ప్రాంత ఆస్పత్రులు. అరకొర వసతులు… అందని అత్యవసర సేవలు. ప్రైవేటులో చూపించుకోలేని దైన్యం. ఆర్థిక దీన స్థితి. పర్యవసానంగా ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వచ్చిన దుర్గతి. ఇవన్నీ కళ్లముందే జరిగాయి. ఆత్మీయులంతా పిట్టల్లా కళ్లముందే రాలుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత.
కానీ, ఆ ఆమాత్యుడికి మాత్రం ఏదో చేయాలనే ఆలోచన. తపన. పేద ప్రజలు ప్రాణాలు పోతుంటే వారిని కాపాడలేమా అనే ఆలోచన మధ్య నిద్రలేని రాత్రులు. అంతిమంగా ఓ ఆలోచన. ఉడతా భక్తిగా అప్పటి వరకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్న ఆ ఆమాత్యుడికి తక్షణ కర్తవ్యం బోధపడింది. ప్రాణాలను కాపాడితే అదే తన జీవితానికి పరమార్థమనుకున్నాడు. స్నేహితుల సహాయం కోరాడు, తనూ ఆపన్న హస్తం అందించాడు. ఆర్థికంగా కోటిన్నర జమ చేయగలిగాడు. డాక్టర్లు, కలెక్టర్ల సలహా తీసుకున్నాడు.
బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రావాలనేది సంకల్పం. అత్యవసర సేవలకు ఎక్కడికో వెళ్లాల్సిన దుస్థితి రావొద్దనేది ప్రధాన ఉద్దేశ్యం. ఆ మేరకు ఆక్సిజన్ ప్లాంటు.. సిలిండెర్లు నింపేందుకు యూనిట్లు… అన్ని దవాఖానల్లో అత్యవసర సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు. మొత్తంగా ఆ నియోజకవర్గంలోని అన్ని దవఖానలు కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే రూపురేఖలను సంతరించుకున్నాయి. వసతులన్నీ వచ్చాయి.సేవలు పెరిగాయి. పరిసరాలు పరిశుభ్రంగా తయారయ్యాయి. ఇదీ ప్రభుత్వ ఆసుప్రతేనా అని అబ్బురపడేలా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఓసంక్పలం ఇదంతా చేయించింది. ఆ నియోజకవర్గ ప్రజలకు వరంగా మారింది. ఆ ఆమాత్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి. ఆ నియోజవర్గం.. ముందే చెప్పుకున్నాం కదా.. బాల్కొండ.
ఇప్పుడీ నియోజవకర్గం రాష్ట్రానికి తలమానికంగా మారింది. ఓ దిక్సూచిగా నిలిచింది. ప్రజాప్రతినిధులు ఇలా కూడా చెయ్యొచ్చని చెప్పింది. కరోనా పాఠాలు .. గుణపాఠాలు పేద ప్రజలకు మరింత మెరుగ్గా అత్యవసర ప్రభుత్వ వైద్యాన్ని అందించేందుకు దోహదపడ్డాయి. భవిష్యత్తులతో పేదవారెవ్వరూ అనారోగ్యంతో సరైన చికిత్స, వైద్యసదుపాయం లభించక మరణించొద్దనే ఓ గొప్ప ఆలోచనకు కార్యచరణకు ఈ బాల్కొండ తాజా ఉదాహరణ. ఓ స్పూర్తి. అనుసరణీయం.
https://m.facebook.com/story.php?story_fbid=2230120720463802&id=100003976884414