బిగ్‌బాసు చాలా కలర్‌ఫుల్‌గా ఉందీ రోజు. ఆహా ఏమా పాటలు, ఏమా నడుం ఒంపులు.. ఆమె అందచందాలు.. కళ్లు రెండూ చాలవనుకో. నాలుగైదు సినిమాల ఐటెం సాంగులన్నీ ఒకే చోట ప్రదర్శిస్తే వచ్చే ఒంపుసొంపులన్నీ ఒక్కదగ్గరే .. ఒకే ఇంట్లో మనకు కనిపించే భాగ్యం చేశాడన్న మాట మన బిగ్‌బాసు. రెయిన్ సాంగులకు ఏమీ తక్కువ కాకుండా ఎగిరారు మనవాళ్లు కూడా. మంచిగానే ప్రిపేరై వచ్చి
నట్టుగా మంచి జోష్ మీదున్నారు. చిన్నపిల్లలకు పెట్టిన పోటీలు, పనిష్‌మెంట్లు.. అవన్నీ పోతే.. డ్యాన్సులైతే బాగానే ఉన్నాయి బాసు.. కానీ ఇంట్లో పిల్లలతో కలిసి కాకుండా.. అలా ఒంటరిగా చూస్తే ఇంకా మజా ఉంటుండే. మన నాగ్ కూడా మాంచి ఎంజాయ్ చేశాడనుకో.. ఇంకొంచె వయస్సు తగ్గినట్టు ఫీలయ్యి ఉంటాడు. నటరాజ్ మాస్టర్‌ను ఎలిమినేట్ చేశారు. మరీ ఓవర్ యాక్షన్ చేసి.. ఓవర్ సెంటిమెంట్ ప్లే చేస్తే ఎలా బాసు. అందుకే పంపి ఉంటారు. ఓవర్ ఏడుపులు.. అన్నీ ఓవర్.. ఓవర్.