రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ విడుదల డేట్‌ను మొత్తానికి అధికారికంగా ప్రకటించేశారు. దాదాపు మూడేండ్లుగా సినిమా నిర్మాణం ఆగుతూ.. కొనసాగుతూ.. ఎట్టకేలకు పూర్తి దశకు వచ్చింది. జనవరి 7న విడుదల చేయనున్నట్టు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫేస్‌బుక్ వాల్ పై ప్రకటించాడు. దీంతో ఈ సినిమా విడుదల పై సస్పెన్స్ వీడింది. ఉత్కంఠకు తెరపడింది.

అల్లూరి సీతారామారాజు, కొమరంభీం జీవితగాధలు, చారిత్రక నేపథ్యాన్ని తీసుకుని కల్పిత కథతో అల్లుకున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. బహుబలి – 2 తర్వాత జక్కన్న దర్శకత్వంలో లాంగ్ గ్యాప్ అనంతరం వస్తున్న సినిమా ఇది. ఓ చారిత్రక కథ ఆధారంగా ఇద్దరు యువ హీరోలు నటిస్తున్న ఈ సినిమా పై మొదటి నుంచి చర్చ కొనసాగుతున్నది. మధ్యలో కొంత వివాదాన్ని కూడా ఎదుర్కొన్నది. కల్పిత కథ, వారి చారిత్రక నేపథ్యాన్ని దెబ్బతిసే విధంగా ఉంటే క్షమించబోమనే వార్నింగ్‌లను కూడా జక్కన్న ఎదుర్కొన్నాడు.

ఎట్టకేలకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల డేట్‌ను ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సహం కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్‌కి అభిమానులు వెల్లువలా బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ కామెంట్లు పెట్టారు. అయితే ఆంధ్రాలో జగన్ ‘ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్’ వ్యవహారం పై ఇంకా పట్టు వీడలేదు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలకు మరో మూడు నెలల సమయం ఉండడంతో అప్పటి వరకు ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.

 

 

You missed