(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆమెను ఒంట‌రి చేద్దామ‌నుకున్నారు. ఆ క్ర‌మంలో ఆడ‌బిడ్డ అని కూడా చూడ‌కుండా వేసిన అప‌నింద‌లు, చేసిన అవ‌మ‌నాలు, కుట్ర‌ల ప‌న్నాగాలు అన్నీ చేధించారామె. ఒక్కొక్క‌టిగా ఎదుర్కొని నిలిచారు. కాలం క‌లిసిరాగా, ధ‌ర్మం తోడు నిల‌వ‌గా క‌డిగిన ముత్య‌మే అయి గెలిచి చూపించారు. ఆమె ఒక్క‌రే ఒకవైపు .. మిగిలిన శ్ర‌తు శిబిరమంతా మ‌రోవైపు. అయినా అదే మొక్క‌వోని ధైర్యం, నిండైన ఆత్మ‌విశ్వాసం, క‌ష్టాలెన్నొచ్చినా అదే నిబ‌ద్ద‌త‌, నిజాయితీ.. ఇవ‌న్నీ క‌లిసి ఆమే ఓ సైన్యంలా మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అదీ శుభారంభంతో. త‌న‌దైన పంథా, శైలితో జ‌నం నాడి తెలిసిన నేత‌గా, పేద‌, బ‌డుగు,బలహీన వ‌ర్గాల‌, మ‌హిళ‌ల క‌ష్టాలు, బాధ‌లు ద‌గ్గ‌రగా చూసి చ‌లించిన నాయ‌కురాలిగా స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఉద్య‌మాల రూప‌క‌ల్ప‌న చేసి.. పేద‌ల‌కు న్యాయం చేసే క్ర‌మంలో స‌క్సెస్ బాట వైపున ప‌య‌నిస్తున్నారు. జ‌నం ఆధరాభిమానాలు చూర‌గొనేక్ర‌మంలో మ‌రింతగా చేరువ‌వుతున్నారు. అందుకే ఆమెప్పిడు ఒంటరిగా కాదు. ఆమే ఒక సైన్యం.

తెలంగాణ జ‌నానికి దూరం చేయాల‌నే కుట్ర‌ల‌ను తుత్తునియ‌లు చేస్తూ ఇక్క‌డి స‌మాజానికి ఆశాకిర‌ణ‌మై నిలిచారామె. తెలంగాణ లోపించిన ప్ర‌తిప‌క్ష పాత్ర‌కు ఆమె బ‌లం చేకూర్చే నాయ‌కురాల‌య్యారు. ఖ‌మ్మం దీక్ష‌తో జ‌నం ప‌ట్ల, బాధిత వ‌ర్గం ప‌ట్ల త‌న‌కున్న క‌మిట్‌మెంట్ ఏపాటిదో జ‌స్ట్ ఓ శాంపిల్ చూపారంతే. పార్టీ పెట్ట‌క‌ముందే పాల‌క వ‌ర్గాన్ని ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తూ.. ఆమె రాక‌నే త‌మ ఉనికికి ప్ర‌మాద‌మ‌ని త‌ల‌చి కుట్ర‌లు ప‌న్ని కన‌మరుగు చేయాల‌నుకున్న బీఆరెస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న.. ఐరెన్ లేడీ కవిత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

ఓ ర‌కంగా ఆమెకు ఇప్పుడు పున‌ర్జ‌న్మ‌లాంటిదే. ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌. ఇప్పుడో లెక్క‌గా త‌న‌ను తాను తీర్చిదిద్దుకుని ముందుకు సాగుతున్న తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న‌ది. తండ్రీ, అన్నా.. ర‌క్త సంబంధాలనూ కాల‌రాసిన వేళ‌.. ఆడబిడ్డ అని కూడా చూడ‌కుండా అధఃపాతాళానికి తొక్కేయ‌డానికి ఏ మాత్రం సంకోచించ‌ని ఓ దుర్మార్గ వాతావ‌ర‌ణాన్ని చ‌విచూసిన క‌విత‌.. నిన్న‌టి దాకా నివురుగ‌ప్పిన నిప్పు.. ఇప్ప‌డు క‌డిగిన ముత్యం. ఇక త‌న‌దారి త‌న‌ది. త‌న పంథా త‌న‌కు. జ‌నంబాట‌లో ఆమె ప్ర‌యాణం ఎటువైపు ఓ ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక ఆమెకుంది. జ‌నం బీఆరెస్‌ను ఎందుకు చీత్క‌రించారో ఆమెకు తెలుసు. ఇప్పుడున్న పాల‌క‌వ‌ర్గాన్ని ఎందుకు నెత్తికెత్తుకున్నారో తెలుసు. జ‌నం ఈ పాల‌న‌లో ప‌డుతున్న బాధ‌లేందో.. న‌ర‌క‌యాత‌నలేందో తెలుసు. త‌ప్పులెక్క‌డ జ‌రిగాయో తెలుసు. తెలిసీ ఎలా త‌ప్పులు, పాపాలు చేశారో తెలుసు. బాధిత వ‌ర్గ‌మూ తెలుసు. ప‌రిష్కార మార్గ‌మూ తెలుసు. త‌న కింకర్త‌వ్య‌మేందో తెలుసు.? ఇంత‌గా క్లారిటీ ఉన్న నేత ఇప్పుడు రాష్ట్రంలో మ‌రెవ‌రూ లేరు.

అందుకే ఆమె ఇప్పుడు తెలంగాణ స‌మాజానికి ఆశాకిర‌ణంగా కనిపిస్తున్న‌ది. ప‌రిణ‌తి రాజ‌కీయ నాయ‌కురాలిగా, విష‌య ప‌రిజ్ఞానం మెండుగా ఉన్న నేత‌గా, అంత‌కు మించి జ‌నం నాడి గుర్తెరిగిన ఆడ‌బిడ్డ‌గా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోయేందుకు ఆమె సిద్దంగా ఉంది. అలుపెర‌గ‌ని, అకుంఠిత దీక్షతో జ‌నం మ‌ద్ద‌తు తోడురాగా.. రాష్ట్ర య‌వ‌నిక‌పై ఆమె త‌నదైన ముద్ర వేసేందుకు అడుగు ముందుకు వేస్తున్న శుభ‌త‌రుణంలో ఆమెకు వాస్త‌వం త‌ర‌పున ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

 

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *