ఐటి, మునిసిపల్ మంత్రిగా ప్రజల జేజేలు అందుకుంటున్న కేటీఆర్ ను డ్రగ్స్ కేసులో చట్టవ్యతిరేక సంబంధాలు ఉన్నట్లుగా టిపిసిసి అధ్యక్షుడు కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం, దాంతో కేటీఆర్ రేవంత్ మీద పరువునష్టం దావా వెయ్యడం, ఆ కేసును కోర్ట్ విచారణ చేపట్టి, కేటీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయరాదని, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయరాదని రేవంత్ రెడ్డిని ఆదేశిస్తూ ఇంజక్షన్ ఆర్డర్స్ ఇచ్చింది!
మరొక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, మంత్రులను విపక్షనేతలు బండబూతులు తిడుతుంటారు. హోమ్ మంత్రి మీద కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అధికారపార్టీలో ఎవ్వరూ సదరు నేతలకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళరు. బహుశా..వెళ్లినా ప్రయోజనం ఉండదని వారి విశ్వాసం కావచ్చు. కోర్టులలో ఆ పార్టీని ఓడించలేమనే నమ్మకం బలపడి ఉండటం కావచ్చు.
నిన్నో మొన్నో రాశాను…అక్కడ తిట్టినట్లు తెలంగాణాలో తిడితే ఫలితాలు మరోరకంగా ఉంటాయని!
రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడటం అలవరచుకోవాలి. బజారుమాటలు మాట్లాడితే వారి తోకలు కొయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ప్రజలు గౌరవించే నాయకుల మీద అసభ్యంగా కూతలు కుయ్యడం హర్షణీయం కాదు. ఏదైనా ఉంటే ఎన్నికలలో చూసుకోవాలి!
మంత్రి కేటీఆర్ కు
అభినందనలు
.మురళీమోహన రావు ఇలపావులూరి