రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 7న నిర్మల్ నుంచి విధులు ముగించుకుని వస్తున్న ఉప్పల విక్రమాదిత్య (31) ఆర్మూర్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో డివైడర్‌కు ఢీకొన్నాడు. దీంతో కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి చికిత్స కోసం నగరంలోని లక్ష్మారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి గాంధీకి రిఫర్ చేశారు. గాంధీలో సర్జరీ చేసినా.. ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఈనెల 9న మృతి చెందినట్టు గాంధీ వైద్యలు ధ్రువీకరించారు. నిజామాబాద్‌లో అంబేద్కర్ కాలనీకి చెందిన విక్రమాదిత్య మెడికల్ రిప్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.