(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఇప్పుడిట్ల‌నే ఉంది కేసీఆర్ ప‌రిస్థితి. ఫోన్ ట్యాపింగ్ ప్ర‌తీ గ‌వ‌ర్న‌మెంట్‌లో కామ‌న్‌.. ఇదేమీ పెద్ద విష‌యం కాదు.. మీరు పెద్ద‌గా భ్ర‌మ‌ల్లో ఉండ‌కండి.. రాహుల్‌! విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఇది కేసీఆర్ స్పంద‌న. అయినా మాకేం సంబంధం.. అది పోలీసుల అంత‌ర్గ‌త విష‌యం. వారు చేయాల్సిన డ్యూటీ .. అని కూడా సెల‌విచ్చారు. మ‌రి ఇన్నేండ్లు పాలించిన ఏ పాల‌కుడి పాల‌న‌లో కూడా ఇంత‌లా ట్యాపింగ్ ఇష్యూ రాలేదెందుకు? ఇప్పుడే ఇది ఎందుకు చ‌ర్చ‌కు వ‌స్తుంది? ఇంత‌లా దీన్ని వాడుకుని, దిగ‌జారిన పాల‌న మీది కాదా? ఇవి క‌దా ఇప్పుడు తేలాల్సింది. మేమే తెచ్చాం తెలంగాణ‌.. ఇది మా జాగీరు.. మేం ఏం చేసినా చెల్లుతుంద‌ని అహంకారం ఓవైపు.. ఎవ‌రు ఎటువైపు నుంచి మాకు ఎస‌రు పెడ‌తారోన‌నే భ‌యం.. అభ‌ద్ర‌తా భావం… ఈ రెండూ క‌లిసి విచ్చ‌ల‌విడి ఫోన్ ట్యాపింగ్‌కు తెగ‌బ‌డేలా చేసింది. ఇది వాస్త‌వం కాదా? ఆఖ‌రికి మీ న‌మ‌స్తే తెలంగాణ‌లోని జ‌ర్న‌లిస్టుల ఫోన్ల‌ను వ‌ద‌ల్లేదు.

ఇది కూడా పోలీసుల చర్యేనా? మీరు చెప్పందే.. సీఎం, సీఎం కొడుకుగా కేటీఆర్ ఆదేశించ‌నిదే ఇంటెలిజెన్స్‌, పోలీస్ వ్య‌వ‌స్థ ఇన్ని వంద‌ల ఫోన్లు ట్యాప్ చేశారా? ఇప్పుడు ఇది కదా తేలాల్సింది. అందుకే అన్నాను.. ఇంత బ‌తుకు బ‌తికి ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు.. అని. అవును. త‌న‌కు తానే జాతిపిత‌గా కీర్తి కండువాలు త‌గిలించుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఈ ఉచ్చులు, చిక్కులు ఎవ‌రో బిగించి కాదు. వారికే వారే చేసుకున్న క‌ర్మ‌. మాకు తిరుగులేదు. మేం త‌ప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే హ‌క్కు, అర్హ‌త ఎవ‌రికీ లేదు. మేమే మ‌ళ్లీ. మ‌ళ్లీ మ‌ళ్లీ మేమే. ఎప్ప‌టికీ మేమే. నేను కాక‌పోతే నా కొడుకు. నా కొడుకు కాక‌పోతే నా మ‌న‌వ‌డు.. ఇగో ఇట్ల‌నే సాగింది పాలన‌. కేసీఆర్ ఆలోచ‌న‌. టెలీగ్రాఫ్ చ‌ట్టం.. దేశ ర‌క్ష‌ణ‌.. దేశ భ‌ధ్ర‌త అని ఎన్ని క‌బుర్లు చెప్పినా.. దీని సాకు చెప్పి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌నే భ్ర‌మే అవుతుంది. ఎందుకంటే ఇది మామూలు ట్యాపింగ్ కాదు. హ‌ద్దులు దాటిన బ‌రితెగింపు. అభ‌ద్ర‌తాభావం. అహంభావం. అందుకే ఇప్పుడు ఇలా క‌ర్మ రిట‌ర్న్స్ అంటూ సిట్ నోటీసులిచ్చింది. ఎక్క‌డ కేసీఆర్.. ? ఎలాంటి కేసీఆర్‌… ? ఎంతటి కేసీఆర్‌..? ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కా..? అయుత చండీయాగం చేసినా .. ఈ క‌ర్మ నుంచి త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాద‌ని తేలిపోయింద‌నుకోవాలా?

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *