(దండుగుల శ్రీనివాస్)
ఇవాళ రెండు సంఘటనలు ప్రధానంగా వార్తల్లో నిలిచాయి. వైరల్ అవుతన్నాయి. ఒకరేమో నిత్య విద్యార్థిలా పాఠాలు నేర్చుకుంటున్న నాయకుడు. మరొకరేమో పదేళ్ల పాలనలో షాడో సీఎంగా అరచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచినవాడు. ఒకరేమో డాబు, దర్పం, హోదా వదిలి ఎముకలు కొరికే చలిలో కొత్త పాఠాలు నేర్చుకుంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన లీడర్. మరొకరు తండ్రికి, కూతురికి కూడా కయ్యాలు పెట్టి వారిని దూరం చేసి పాపం మూటగట్టుకున్నవాడు. ఒకరేమో .. తనకు తాను జాతిపితగా ప్రకటించుకుని ఇక తనకు తిరిగే లేదని విర్రవీగిన నాయకుడిని ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేసిన యువ నాయకుడు. ఇంకొరేమో.. తను ఫోన్ చేస్తే కేసీఆర్ చేసినట్టేనని భాషాలో ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టేనన్నట్టుగా హుకూం నడిపించుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఆద్యుడు.
ఇప్నుడు ఈ ఇద్దరూ ఎవరో తెలిసిందనుకుంటా. ఒకరేమో సీఎం రేవంత్‌రెడ్డి. మరొకరు సంతోష్‌రావు. ఒకరు స్టూడెంట్ నెంబర్ వన్‌గా పిలుచుకోబడుతుంటే.. మరొకరు దయ్యం నెంబర్ 1గా నామకరణం చేపించుకున్నారు. ఈ దయ్యం నెంబర్ వన్ అన్నది ఎవరో కాదు.. అతగాడి చెల్లె, కేసీఆర్ తనయ కవితమ్మ. అవును.. ఇవాళ సంతోష్‌రావును సిట్ విచారణకు పిలిచింది. అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో. దీనిపై ఆమె స్పందిస్తూ ఇతగాడే అన్ని అరాచకాలకు ఆద్యుడని, దయ్యం నెంబర్ వన్ అని కితాబిచ్చేసింది. ఇక దయ్యం నెంబర్లు 1, 2, 3, 4,5… వరుసగా ఎవరెవరో కూడా చాలా సందర్భాల్లో ఆమె ప్రత్యక్షంగా, పరోక్షంగా క్లారిటీ కూడా ఇచ్చేసింది.
ఇక స్టూడెంట్ సీఎం గురించి… అమెరికాలో ప్రఖ్యాత హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు రేవంత్ ఓ స్టూడెంట్. బుద్దిగా ఉందయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అక్కడే క్లాసులో పాఠాలు నేర్చుకుంటున్నాడు. అదీ ఎముకలు కొరికే చలిలో. అక్కడి వాతావరణం కనీసం బయటకు రానీయకుండా జనాలను వణికిస్తున్నది. ఈ వణికించే చలిలో ఈనెల 30 వరకు సీఎం రేవంత్‌రెడ్డి 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సు నేర్చుకుంటున్నాడు. ఈ కోర్సు సర్టిఫికేట్‌ను పొందే తొలి సీఎంగా కూడా పేరుకెక్కనున్నాడు. అదే మన జాతిపితగారైతే.. నాకెందుకీ చదవులు.. నేనిప్పటికీ 70వేల పుస్తకాలు చదివిపారేశా అంటారేమో. సరేలే, ఇప్పుడా విషయం ఎందుకులే గానీ.. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్‌వన్ గా సీఎం పేరు చక్కర్లు కొడుతుంటే.. దయ్యం నెంబర్ వన్‌గా సంతోష్‌రావు పేరు గింగిరాలు తిరుగుతుంది నెట్టింటా. ఇవాళ్టికివే ముఖ్య వార్తలు. మళ్లీ ముఖ్యవార్తలతో కలుద్దాం.

Dandugula Srinivas
Senior JOURNALIST
7661066999
