(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఓ న‌క్క ప్ర‌మాణం చేసిందంట‌… ఇంకెవ‌ర్నీ మోస‌గించ‌న‌ని! ఓ పులి ప‌శ్చాత్తాపం ప్ర‌కటించిందట తోటి జంతువుల్ని సంహ‌రించ‌న‌ని!! ఈ క‌ట్టుక‌థ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి. అలిశెట్టి ప్ర‌భాక‌ర్ రాసిన క‌విత ఇది. అచ్చంగా కేటీఆర్‌కు, కేసీఆర్ పాల‌న‌కు న‌ప్పుతుంది. కేటీఆర్‌కు ఎవ‌రు స‌ల‌హాలిస్తున్నారో గానీ ఇగో ఇసొంటి బ్ర‌హ్మాండ‌మైన అవిడియాలు వ‌స్తున్నాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా.. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో రాజ్యాంగ ఉల్లంఘ‌న‌.. ప్ర‌జాస్వామ్య స్పూర్తి అంటూ నాట‌కాలేశాడు. అదే నాట‌కాలు ప్ర‌ద‌ర్శింపజేశాడు.

చేసిందంతా చేసి ఇప్పుడు నీతి సూత్రాలు వ‌ల్లెవేస్తున్నాడు. డ్రామాలేసి.. ప్ర‌తిప‌క్షాలు ముద్దుగా పిలుచుకున్న‌ట్టు డ్రామారావు అనిపించుకున్నాడు. ప‌దేళ్లూ పాలించింది మీరే క‌దా. రాజ్యాంగ ఉల్లంఘ‌న‌లు జ‌ర‌గినే క‌దా .. క‌ర్రుకాల్చి వాత‌పెట్టింది. ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయితేనే క‌దా జాతిపిత‌ను ఫామ్‌హౌజ్‌కు ప‌రిమితం చేసింది. అయినా ఇసొంటి పెద్ద పెద్ద ప‌దాలు మ‌న‌కెందుకు కేటీఆర్‌. మ‌న‌కు అవి సూట్ కావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది.. జ‌నం ఏం కోరుకుంటున్నారీ ప్ర‌భుత్వం నుంచి. మీ నుంచి ఏం మార్పును ఆశిస్తున్నారు. బ‌స్‌.. వీటి గురించి ఆలోచిస్తే చాలు. నీకు మంచి రోజులొస్త‌యి. మేం చేసిన పాపాలేమిటీ? అవి యాది చేసుకుంటూనే ఉండు.. మ‌ళ్లా మ‌ళ్లా అవి చేయ‌కుండా ఉండాల‌ని గ‌ట్టిగా అనుకుంటూ ఉండు. ఇది ప‌రివ‌ర్త‌న‌లో భాగంగా జ‌నాలు చూస్తారు. అప్పుడ‌ప్పుడు జ‌నం ముందుకు పోయిన‌ప్పుడు ఘ్ఘాట్టిగా చెంప‌లేసుకుంటూ ఉండు. జ‌నం కొంచెం క‌నుక‌రిస్తారు. వేదిక‌ల మీదెక్కిన‌ప్పుడు అహం మాట‌లు వీడు.. కొర‌ఢాతో నీకు నువ్వే ఛ‌ళ్లు.. ఛ‌ళ్లు మ‌ని కొట్టుకున్న‌ట్టు మీ లోపాలు పాపాలు ఏక‌రువు పెట్టు.. త‌ప్పైంద‌ని జ‌నం ముందు మోక‌రిల్లినంత ప‌నిచేయి… పాపం అని క‌నుక‌రిస్తారు.

అంతే గానీ మేమేం పాపాలు చేయ‌లేదు. జాతినుద్ద‌రించే ప‌నులే చేశాం.. దేశానికే రోల్ మోడ‌ల్‌గా నిలిచినం.. పార్టీ పేరును కూడా అందుకే మ‌ర్చేసినం.. మ‌హారాష్ట్రలో వేల కోట్లు ఖ‌ర్చు చేసినం.. ఇత‌ర రాష్ట్రాల్లో రైతులు చ‌నిపోతే ఉదారంగా తెలంగాణ సొమ్మును పంచి విశాల దృక్ప‌థం జాతినికి చూపినం…అని ఏవేవో మాట్లాడ‌కు. పాత విష‌యాలు అస‌లే తీయ‌కు. పాత పాపాలు తెలుసుకున్నం త‌ప్పైంద‌నే విధంగానే జ‌నం ముందు ప్ర‌వ‌ర్తించు. ఇదే వారు కోరుకునేది. నీ నోటి వెంట నీతి సూత్రాలు వినాలంటే అబ్బా.. చెప్పొద్దు భ‌లే కంప‌రంగా ఉటుంది. అంద‌రికీ. నిజ్జం. నిజ్జంగా నిజం అన్నా. కావాలంటే ఎంక్వైరీ చేయించుకో. స‌ర్వేలూ చేపించుకో. ఇలాంటి స‌ల‌హాలు ఇచ్చే వాళ్ల‌కు జ‌ర దూరంగా ఉండు.

ఎహె.. పో! చెప్పొచ్చావు అని అంటావా? నీ క‌ర్మ‌. అవును క‌ర్మంటే గుర్తొచ్చింది. మొన్న క‌విత అక్క అన్న‌ది క‌ర్మ రిట‌ర్న్స్ అన్న‌ది నిన్నుద్దేశించే. ఇంకే కావ‌ల‌న్నా ఇంత‌కు మించి. తోడ‌బుట్టిన చెల్లెనే అన్న‌ది. ఇంకా మార‌వా? మార‌న్నా మారు. అవును ఈ నాట‌కాలు, డ్రామ‌లు బాగ‌నే ఉన్నాయి..కానీ అవి తెలంగాణ భ‌వ‌న్‌లోనే వెయ్యాల్నా.. ఇంకెక్క‌డా చోటు దొర‌క‌లేదా అన్నా. ఆ భ‌వ‌న్‌లో వేస్తే…. న‌మ‌స్తే తెలంగాణ‌లో వార్త‌ల్లెక్క‌నే ఉంటాయి. ఎవ‌రూ దానికి క్రెడిబిలిటీ ఇవ్వ‌రు. ఈ లాజిక్ మరిచిన‌వా డ్రామ‌న్నా.. అదే అదే రామ‌న్నా!

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *