(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప‌బ్లిక్ బాగా తెలివి మీరి పోయిండ్రు బై. స‌రైన స‌మ‌యంలో స‌రైన, ధీటైన ఆన్స‌ర్ ఒక్క మాట‌తో, ఒక్క ఫోటోతో చెప్పేస్తున్నారు. ఎంతైనా మునుప‌టి రోజులు కావివి. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఉంటేనే జ‌ర మంచింది. లేక‌పోతే చీరి చింత‌కు క‌డ‌తారు. కేసీఆర్ భాష‌లో చెప్పాలంటే. అవ్‌.. కేసీఆర్ అంటే యాదికొచ్చింది. ఇయ్యాల మొత్తం సిట్ ముందు ఆయ‌న హాజ‌రు.. గులాబీల హంగామా…! ఓ చోటైతే రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌ర్దిల్లాలి అని నాలుక మ‌డ‌త ప‌డేదాకా ఆవేశం అన్నీ చూసినం. కానీ ఇంత‌కు మించి మ‌రో ఫోట్వ గింగిరాలు కొట్టింది సోష‌ల్ మీడియాలో. అదే గ‌ద్ద‌ర్ ఫోటో. అగో గ‌దేందీ..? గీ గ‌ద్ద‌ర్ యాడికెళ్లొచ్చిండు బై మ‌ధ్య‌న‌. అయితే గియితే కేసీఆర్ ఫోట్వ‌లు తింపాలే. జాతిపిత‌కు అన్యాయం జ‌రిగింద‌నాలే.

అస‌లు తెలంగాణ‌కే ఇది పెద్ద బ్లాక్ డే అని గొంతు పోయే దాకా గ‌గ్గోలు పెట్టాలె. గంతేగ‌ని.. గీ గ‌ద్ద‌ర్ ఏదో గేట్ ద‌గ్గ‌ర కూసుని ఎవ‌లో పిలుస్త‌ర‌ని వెయిటింగ్ చేసిన‌ట్టు.. దీనంగా చేతులు క‌ట్టుకుని ఉన్న గీ ఫోట్వ ఎందుకు? నాకైతే స‌మ‌జ్ కాలే. దిమాఖ్ ల‌డాయించంగా…ల‌డాయించంగా స‌మ‌జైందేందంటే.. గ‌ప్పుడు కేసీఆర్ సారు గీ గ‌ద్ద‌ర్ సారును ఇలా ప్ర‌గ‌తిభ‌వ‌న్ లోప‌లికి రాకుండా గిట్ల బ‌య‌ట కూసోబెట్టిండంట‌.ప్ర‌జాయుద్ద నౌక‌కు ఇంత‌టి అవ‌మానం చేసిన కేసీఆర్‌కు… సిట్ పిలిస్తే ఏందీ..? రేపు లోప‌ల జైళ్ల‌కు తోలితే ఏందీ? అని ఇట్ల గ‌డ్డి పోచ లెక్క‌నే తీసిపారేసిండ్రు నెటిజ‌న్లు.

అవ్‌.. మ‌ళ్లా కోదండ‌రామ్ ఇంట్ల‌కు జొర‌బ‌డి, ఇంటి ద‌ర్వాజ‌లు ప‌ల్గొట్టి మీర ప‌ట్క‌పోయి అవ‌మానించింది సూడ‌లేదా? ఆళ్లు చేయ‌ని త‌ప్పుల‌కు పెద్ద శిక్ష‌లేస్తివి.. అవమానం జేస్తివి. ఆత్మ‌గౌర‌వం మీన దెబ్బ కొడితివి. ఇప్పుడు నువ్ చేసిన పాపానికే క‌దా సిట్ ముందుకు పోయిన‌వ్‌. అండ్ల త‌ప్పేముంది? వింతేముంది? అవ‌మాన‌మేముంది? స్వ‌యానా నీ బిడ్డె క‌విత‌నే క‌దా .. త‌న భ‌ర్త ఫోన్‌ను కూడా ఒద‌ల‌కుండా ట్యాపింగ్ చేశార‌న్న‌ది. సిగ్గు లేదా అని కూడా తిట్టింది. అయ్య‌ను, అన్న‌ను, బావ‌ను క‌లిపి ఒకే మాట‌లో. ఇంకా ఇంత‌క‌న్నా సాక్ష‌మేమి కావాలె.

ఇన్ని ఫోన్లు, ఇంత మంది ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వ‌చ్చిందో నాకైతే అర్థం కాలే బై. పిరికిత‌న‌మా, భ‌య‌మా, అహంకార‌మా? అతి జాగ్ర‌త్త‌.. లేక‌పోతే పిరికిత‌నం నిండిన భ‌యంతో కూడిన అధికారం తెచ్చిపెట్టిన మితిమీరిన అహంకారంతో కూడిన అతి జాగ్ర‌త్త‌… మీకైనా తెలుసునా..? నాకైతే పైవ‌న్నీ అనే ఆప్ష‌న్ ఉంటే ఆ బ‌ట‌న్‌నే ఒత్తుత‌. స‌రేగానీ, కేసీఆర్ అంటేనే తెలంగాణ‌, తెలంగాణ అంటేనే కేసీఆర్‌.. అనే బానిస మాట‌లు ఇగ చెప్ప‌కుండ్రి. బాగా పాత‌గా, పాసిపోయిన నినాద‌మైంది. జ‌నం చీద‌రించుకుని సానుభూతి జాగ‌ల మ‌రింత బండ‌కేసి స‌ప్ప‌రియ్యాలె అనే కాడికి తెచ్చుకోకుర్రి. గ‌దే జ‌రుగుతున్న‌ది. జ‌ర‌బోతున్న‌ది.

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *