(దండుగుల శ్రీ‌నివాస్‌)

స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ ఇలాఖ వికారాబాద్‌పై కేటీఆర్ క‌న్నుప‌డింది. అక్క‌డి మున్సిపాలిటీకి కైవ‌సం చేసుకునేందుకు స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి కేటీఆర్‌… ఓ బ‌ల‌మైన అభ్య‌ర్థిని దింపేందుకు రెడీ అయ్యాడు. ఆమే… సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రి ఏ చంద్ర‌శేఖ‌ర్ కూత‌రు చంద్ర‌ప్రియ‌. ఏసీఆర్ కాంగ్రెస్‌లోనే ఉన్నా.. వీరు బీఆరెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్‌తో స‌మానంగా బీఆరెస్ కూడా కొంత బ‌లంగా ఉంది. దీంతో కేటీఆర్ దీనిపై గురి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంకేతం కూడా పంపొచ్చ‌న‌కుంటున్నాడు. స్పీక‌ర్ బిడ్డెనే ఓడ‌గొట్టాం చూశారా? అని ప్ర‌భుత్వానికి స‌వాల్ విస‌రాల‌నేది కేటీఆర్ ఆకాంక్ష‌గా క‌నిపిస్తున్న‌ది. వాస్త‌వానికి ఈ ప‌ద‌విని ఏసీఆర్ కూతురుకు ఇవ్వాల‌నేది ముందుగా ఒప్పందం చేసుకున్న అంశం. కానీ ప్ర‌సాద్ మాట మార్చాడు. త‌న కూతురిని అనూహ్యంగా బ‌రిలోకి దింపాడు. దీంతో ఏసీఆర్ కొంత అసంతృప్తికి లోన‌య్యాడు.

కూత‌రు మాత్రం పోటీ చేయాల‌నే ప‌ట్టుబ‌డుతోంది. దీంతో వారు ప్ర‌త్యామ్నాయంగా బీఆరెస్‌ను సంప్ర‌దించారు. వాళ్లు కూడా ఈ ప‌రిణామాల‌కు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పిటికే చ‌ర్చ‌లు ముగిశాయి. మెతుకు ఆనంద్ మాత్రం అయిష్టంగా ఉన్నాడు. త‌న సీటుకు ఎక్క‌డ ఎస‌రు పెడ‌తారోన‌ని. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వికారాబాద్ మున్సిపోల్స్ హాట్ హ‌ట్‌గా మారాయి. ఏసీఆర్ పార్టీ మార‌కున్నా.. బిడ్డె పార్టీ మారితే ఆయ‌న అనుచ‌రులు మొత్తం తెర‌వెనుక బీఆరెస్‌కే స‌పోర్టు చేసే చాన్స్ ఉంది. దీంతో ప్ర‌సాద్‌కు రిబెల్స్ బెడ‌ద త‌ప్పేలా లేదు. ఇది అధికార పార్టీ ఓట‌మికి దారి తీస్తే… అదే కేటీఆర్ కోరుకుంటున్న‌ది. స్పీక‌ర్, ఏసీఆర్ మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. మాటాముచ్చ‌టా లేదు. ఇదీ బీఆరెస్‌కు క‌లిసి వ‌స్తున్న అంశం.

Dandugula Srinivas

Senior JOURNALIST

7661066999

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *