కామారెడ్డి బీఆరెస్‌లో ఎవరికివారే.. చక్కదిద్దే పనిలో రామన్న… కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం… కేసీఆర్ పోటీ నేపథ్యంలో బీఆరెస్ పరిస్థితి పై అధిష్టానం అయోమయం.. సమన్వయం లేని నేతలతో దిక్కుతోచని స్థితిలో క్యాడర్.. పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్.. రంగంలోకి రామన్నను దింపిన అధినేత..
కామారెడ్డి బరి నుంచి గులాబీ దళపతి పోటీకి దిగడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు బూస్టింగ్ వచ్చిందని భావించారంతా. కానీ అక్కడే అసలు సమస్యలు తిష్టవేశాయి. పార్టీ పరిస్థితి దినదినం ఇక్కడే మరింత అధ్వానంగా మారుతూ వస్తోంది. నేతల మధ్య సమన్వయం లేదు.…