(దండుగుల శ్రీనివాస్)
నన్ను గెలకొద్దురోయ్… అసలే నేను మంచోడిని కాదు.. మొన్ననే అన్నడీ మాట రేవంతు. గెలక్కున్నాడు మళ్లీ ఇవాళ కేటీఆర్. కావాలనే బూతులు ప్రయోగించాడు. ఇష్టమొచ్చినట్టు వాగాడు. నా పేరు తీయవా బిడ్డా.. నేనేం తక్కువనా నీకు… నన్నంతా చీప్‌గా తీసేస్తవా..? అనుకున్నడేమో! లొడాలొడా వాగాడు. అరే హౌలే అన్నడు. పొట్టోడా అని బాడీ షేమింగుకూ దిగాడు. కుర్చీ ఏసుకుని పెద్దగా కనిపించే ప్రయత్నం చేస్తే అమితాబ్ బచ్చన్ అవుతవా..? అని తిట్టాడు. పంది ఎన్నటికీ నంది కాలేదని కూడా వాగేశాడు. నువ్వెన్నటికీ కేసీఆర్ స్థాయికి రాలేవని కూడా తీర్పిచ్చేసిండు.
నీకు సీఎం పదవి ఎప్పుడు పోతదోననే భయం పట్టుకున్నది. అందుకే మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగు చేస్తున్నవ్…! కాదంటవా..? అయితే నీ మనువడి మీద ఒట్టేసి చెప్పు..! అన్నడు. ఇంతగానం వాగినంక రేవంతు ఊకుంటడా..? ఎట్లైనా నాగర్‌కర్నూర్ జిల్లా కొల్లాపూర్‌లో బహిరంగ సభ ఉండనే ఉంది. ఆ విషయం కేటీఆర్‌కు తెలుసు. అందుకు ఇవన్నీ వాగిండు. రేవంత్ కూడా డిసైడ్ అయ్యిండు. బిడ్డా గెలకకురా అంటే గెలుక్కుంటవ్..! అయిపోయింది మీ పని అనుకున్నడు. ఇగ అర్సుకున్నడు ఘాట్టిగా. బూతుల వాగుడికి శాపాల సమాధానం చెప్పిండు. శపథాల సవాల్ విసరిండు. పాలమూరు బిడ్డనే మరో పదేళ్లూ సీఎంగా ఉండబోతున్నాడని చెప్పేశాడు.
రాస్కోరా సాంబా.. అని కూడా కేసీఆర్‌కు సవాల్ విసిరిండు. ఇది నా మాట. నా మాటే శాసనమన్నాడు. నువ్వు, నీ కొడుకు కలిసి పెట్రోల్ పోసుకుని సస్తరో ఏం చేస్తరో ఇగ మీ ఇష్టమని కూడా చెప్పేశాడు. తెలంగాణ ప్రజల పాపాలు తగిలి.. అవి శాపాలుగా మారి, నీ కడుపు మంట తోడై.. పెంచుకున్న విషం నిన్నే కాలనాగులా కాటేస్తదని శాపమిచ్చాడు. ఆ దవాఖన్లనే నీ పని ఖతమైతది బిడ్డ సూస్కో అని శాపం పెట్టాడు. జోస్యం చెప్పాడు.

Dandugula Srinivas
Senior Journalist
8096677451
