దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో!

అర్వింద్‌ సిట్టింగు ఎంపీ ఓ అహంకారిగా ముద్రపడ్డాడు. సొంత పార్టీలోనే అతని ఓటమిని బలంగా కోరుకున్నారు. అర్వింద్‌ వ్యతిరేక శక్తులన్నీ బలంగా పనిచేశాయి అతన్ని చిత్తుచిత్తుగా ఓడించేందుకు. కానీ అతనికే బంపర్ మెజార్టీ దక్కనుంది. ఇదెలా సాధ్యం. కేవలం మోడీ ముఖంతో. ఔను… నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ చరిత్ర సృష్టించబోతున్నాడు. బీజేపీ గెలిచిన అభ్యర్తుల్లో భారీ మెజార్టీ సొంతం చేసుకున్న స్థానాల్లో నిజామాబాద్‌ కూడా ప్రధానంగా నిలవనుంది. గత ఎన్నికల్లో కవితపై గెలిచి 70 వేల మెజార్టీ సాధించి తనకంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించుకున్న అర్వింద్‌.. రెండో సారి ఘోరంగా ఓడిపోతాడని అనుకున్నారు.

అతని వైఖరి అలా ఉంది. అన్ని సెక్షన్లలో వ్యక్తిగతంగా వ్యతిరేకత పెరిగింది. ఎల్లప్పుడూ నోరు పారేసుకుని సోషల్‌ మీడియాలో హీరో అవుదామంటే ఏవగింపు కలుగుతుంది. కానీ ఇక్కడ ఏవగింపు కలిగింది. కానీ ఓటమి దిశగా మాత్రం అర్వింద్‌ పోలేదు. భారీ మెజార్టీ దిశగా పోయాడు. ఎందుకు..? మోడీ. అంతే. రాంమందిరం, హిందుత్వం. మరోసారి మోడీ పీఎం కావాలె. అంతే ఇవే నినాదాలు, ఆకాంక్షలు బీజేపీకి ఓటు వేసేలా చేశాయి. అంతే మరోసారి అర్విం్‌ భారీ మెజార్టీ సొంత చేసుకోబోతున్నాడు. రెండోసారి గెలవడం, భారీ మెజార్టీ సొంతం చేసుకోవడం అర్వింద్‌కే చెల్లింది. నిజామాబాద్‌ లోక్‌సభ చరిత్రలో అర్వింద్‌ పేరు నిలిచిపోనుంది.

నిజామాబాద్‌ నుంచి అర్వింద్‌ను కాకుండా ఎవరిని నిలబెట్టినా ఇవే ఫలితాలు వస్తాయనేది మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఆ రేంజ్‌లో మోడీ హవా ఉంది ఇక్కడ. అదే పక్కనే ఉన్న జహీరాబాద్‌లో ఈ పరిస్థితి లేదు ఎందుకు..? అక్కడ కూడా పాటిల్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కనీసం తెలుగు కూడా మాట్లాడం రాని పాటిల్‌కు ఐదు రౌండ్ల వరకు వచ్చిన ఫలితాలలో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ పట్కార్‌ పై సానుభూతి పనిచేసింది. ఇక్కడ కాంగ్రెస్‌ బలంగా ఎదిగింది. దీంతో ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్‌ వైపు పడ్డాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed