దండుగుల శ్రీనివాస్‌ – చీఫ్‌ బ్యూరో:

మోడీ హవా నడుస్తున్నది. ఫలితాలూ అదే విధంగా ఉండనున్నాయి. నిజామాబాద్‌ నగరంలో కౌంటింగ్‌కు ఒకరోజు ముందే ప్రధాన కూడళ్లలో మోడీ ఫ్లెక్సీలు వెలిశాయి. ధన్యవాద్‌ భారత్‌ అంటూ మోడీ ప్రజలకు నమస్కరిస్తున్న ఫోటోతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మూడోసారీ మోడీ సర్కారే అనే విధంగా ఆ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడయ్యేంత వరకూ బీజేపీ శ్రేణులు గప్‌చుప్‌గా ఉన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఒకటో తారీఖు సాయంత్రం రిలీజ్‌కాగానే ఓ అంచనాకొచ్చారు. తామే అధికారంలోకి రాబోతున్నామని డిసైడ్‌ అయ్యారు. నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి కూడా అర్వింద్‌ గెలవబోతున్నాడని ఆ పార్టీ శ్రేణులకు నమ్మకం కుదిరింది. ఇవన్నీ కలిసి మొత్తానికి ఒకరోజు ముందే తామే రాబోతున్నామంటూ ఫ్లెక్సీలతో ఇలా సందడి చేసుకుని సంబురాలు చాటుకున్నారు.

కాంగ్రెస్‌కు నిజామాబాద్‌పై కొంత ఆశ ఉన్నా.. మోడీ మానియాలో అర్వింద్‌ గెలవబోతున్నాడని వారు కూడా లోలోపల ఒప్పుకంటున్న సందర్బం ఇక్కడ ఉన్నది. కాంగ్రెస్ భయమల్లా ఒకటే. తాము విపరీతమైన పోటీ ఇస్తే గెలిచే చాన్స్‌ ఉంది. బీజేపీయే గెలవబోతుందనుకుంటే మోజార్టీ ఊహించజాలమని అంచనాలు వేస్తున్నాయి. కాగా కౌంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో రెండు గంటల్లో ఫలితాల సరళి తెలిసిపోనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

You missed