నాగార్జున వార‌సుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని వ‌రుస ప్లాపుల‌తో తెర‌మ‌రుగ‌య్యే ప‌రిస్థ‌తి వచ్చాడు. బాల న‌టుడిగా 1995లో సిసింద్రి సినిమాలో న‌టించి అంద‌రికీ ప‌రిచ‌య‌మైన అఖిల్ ఆ త‌ర్వాత 2014లో మ‌నం సినిమాలో మెరుపతీగ‌లా క‌నిపించి క‌నువిందు చేశాడు. ఆ త‌ర్వాత పూర్తి స్థాయి హీరో
2015లో వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ భారీ చిత్రాన్ని స‌ర్వ హంగుల‌తో నిర్మించినా బాక్సాఫీస్ వ‌ద్ధ అది అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇది అక్కినేని ఫ్యామిలీకి తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా తీసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను, ఇటీవ‌ల వ‌చ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాల‌న్నీ ప్లాపుల లిస్టుల్లో చేరాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైత‌న్య ఇంకా ఫీల్డ్‌లో నిల‌దొక్కుకునే క్ర‌మంలో అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న సంద‌ర్భంలో చిన్న కొడుకు ప‌రిస్థ‌తి కూడా అదే బాట‌లో కొన‌సాగ‌డం అక్కినేని ఫ్యామిలీకి అసంత్రుప్తిని మిగిల్చింది. స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో అఖిల్ మ‌రో భారీ సినిమాకు ఓకే చెప్పాడు. ఏజెంట్ పేరుతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన అఖిల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ భిన్నంగా రూపొందించారు. సిక్స్‌ప్యాక్‌తో క‌నిపిస్తున్న అఖిల్ పూర్తిగా త‌న రూపురేఖ‌లు మార్చ‌కున్నాడు. అందం, అభిన‌యమే కాదు సిక్స్‌ప్యాక్ కూడా కంప‌ల్స‌రీ అనుకున్నాడేమో. దాన్నే ప్ర‌ధానంగా ప్రొజెక్ట్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డం చ‌ర్చ‌కు తెర తీసింది.

You missed